వామ్మో.. మంచు ఫ్యామిలీలో ఇన్ని కులాలు ఉన్నాయా..?

అలనాటి స్టార్ హీరోగా , నిర్మాతగా, రాజకీయవేత్తగా, విద్యాసంస్థల అధినేతగా ఇలా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు మంచు మోహన్ బాబు. ఈయన సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా రాజకీయ వర్గాలలో కూడా ఈయనకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభించడం గమనార్హం. ఇకపోతే తాజాగా సినీ ఇండస్ట్రీలో మా ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికలను తలపించేలా హోరాహోరీగా మా ఎన్నికలు జరిగి ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు విజయం సాధించాడు. ఈ నేపథ్యంలోనే మంచు విష్ణు గురించి తెలుసుకోవడానికి ఇరు రాష్ట్రాల ప్రజలు కూడా ఆసక్తి చూపడం గమనార్హం.

క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన మోహన్ బాబు పిల్లల వివాహ జీవితంలో మాత్రం పూర్తి స్వేచ్ఛను వారికే వదిలేయడం గమనార్హం. ఇకపోతే మోహన్ బాబు కమ్మ వర్గానికి చెందిన వారు అని తెలిసిన విషయమే. ఇక ఈయన కొడుకు మంచు విష్ణు , రెడ్డి వర్గానికి చెందిన అమ్మాయి అయిన వెరోనికా ను వివాహం చేసుకున్నారు. ఇక ఈ అమ్మాయి ఎవరో కాదు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి కి సొంత చిన్నాన్న కూతురు.

మంచు మనోజ్ కూడా రెడ్డి వర్గానికి చెందిన ప్రణతి రెడ్డి ని వివాహం చేసుకున్నాడు..కానీ వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో వేరు వేరుగా జీవిస్తున్నారు. మంచు లక్ష్మి కూడా బ్రాహ్మణ వర్గానికి చెందిన అబ్బాయిని వివాహం చేసుకుంది. ఇతనొక ఎన్నారై అన్న విషయం తెలిసిందే. ఇలా తన కుటుంబంలో అన్ని సామాజిక వర్గాలకు చెందిన వారికి స్థానం కల్పించడం గమనార్హం.