సినిమా పేరే ఇంటి పేరుగా మార్చుకున్న సెల‌బ్రెటీలు వీళ్లే!

ఏ న‌టులుకైనా, ద‌ర్శ‌కులుకైనా, నిర్మాత‌ల‌కైనా మొద‌టి సినిమా అనేది ఎంతో ప్ర‌త్యేక‌మైన‌ది. అది హిట్టైనా, ఫ్లాప్ అయినా ఫ‌స్ట్ మూవీ ప్ర‌తి ఒక్కిరికీ బెస్ట్ మూవీనే. ఇక కొంద‌రు టాలీవుడ్ సెల‌బ్రెటీలైతే త‌మ మొద‌టి సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నారు. మ‌రి ఆ సెట‌బ్రెటీలు ఎవ‌రో లేట్ చేయ‌కుండా ఓ లుక్కేసేయండి.

దిల్ రాజు: టాలీవుడ్‌లో ఉన్న బ‌డా నిర్మాత‌ల్లో ఒక‌రైన ఈయ‌న‌.. తొలిసారి నిర్మించిన చిత్రం `దిల్‌`. ఈ పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న‌ దిల్ రాజు.. ప్ర‌స్తుతం పాన్ ఇండియా స్థాయిలో సినిమాల‌ను నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే.

అల్లరి నరేష్: రవిబాబు ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `అల్ల‌రి` సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈయ‌న‌.. ఫ‌స్ట్ మూవీ పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నాడు.

వెన్నెల కిషోర్: అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ప‌ని చేసిన కిషోర్‌..`వెన్నెల` సినిమాతోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.

సత్యం రాజేష్: ఈయ‌న తొలి చిత్రం `స‌త్యం`. అందుకే ఆ పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నాడు స‌త్యం రాజేష్‌.

బొమ్మరిల్లు భాస్కర్: `బొమ్మరిల్లు` సినిమాతో డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన భాస్క‌ర్‌.. ఫ‌స్ట్ మూవీతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు.

దేవి శ్రీ ప్రసాద్: టాలీవుడ్ రాక్ స్టార్ దేవి శ్రీ ప్ర‌సాద్ తొలిసారి సంగీతం అందించిన చిత్రం `దేవి.

చిత్రం శ్రీను: `చిత్రం` సినిమాతో సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన‌ శ్రీను.. త‌న తొలి చిత్రాన్నే ఇంటి పేరుగా మార్చుకున్నాడు.