చైతుతో విడిపోయాక తొలిసారి అక్క‌డికెళ్లిన సామ్‌..ఏంటి మ్యాట‌ర్‌..?

టాలీవుడ్‌లో మోస్ట్ బ్యూటీఫుల్ క‌పుల్‌గా గుర్తింపు పొందించిన నాగ‌చైత‌న్య‌-స‌మంత‌లు ఇటీవ‌ల త‌మ వైవాహిక జీవితానికి స్వ‌స్థ ప‌లికిన సంగ‌తి తెలిసిందే. ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట 2017 అక్టోబ‌ర్ 7న పెద్ద‌ల స‌మ‌క్షంలో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టుగా వ్యవహరించిన ఈ జంట మధ్య విభేదాలు తలెత్తాయనే ప్రచారం మొదలైంది.

విడాకులు కూడా తీసుకుంటున్నార‌నే వార్త‌లు ఊపందుకున్నారు. ఇక ఈ వార్త‌ల‌నే నిజం చేస్తూ త‌మ బంధానికి శుభ్రం కార్డు వేసి అంద‌రికీ షాకిచ్చారీ జంట‌. అయితే తాజాగా ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. చైతులో విడిపోయిన త‌ర్వాత స‌మంత తొలిసారి అన్నపూర్ణ స్టూడియోస్ కి వెళ్లింది.

దీంతో అక్కినేని కుటుంబానికి చెందిన అన్నపూర్ణ స్టూడియోస్ కు స‌మంత ఎందుకు వచ్చి ఉంటుంది అని చర్చించుకోవడం మొదలుపెట్టారు నెటిజ‌న్లు. అయితే అన్నపూర్ణ స్టూడియోస్ లో చిత్రీకరణలు మాత్రమే కాదు డబ్బింగ్ పనులు కూడా జరుగుతుంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే.

ప్ర‌స్తుతం స‌మంత గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `శాకుంతలం` సినిమా చేస్తోంది. ఈ పౌరాణిక చిత్రాన్ని దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మిస్తోంది. అయితే ఈ సినిమాలోని తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం కోసంమే సమంత అన్నపూర్ణ స్టూడియోస్ కు విచ్చేసింద‌ని స‌మాచారం. కాగా, శకుంతల, దుష్యంతుల ప్రేమగాథ ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ మూవీలో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ భ‌ర‌తుడి పాత్ర‌లో క‌నిపించ‌బోతోంది.