ఆ హీరోయిన్‌తో రామ్ చ‌ర‌ణ్ ప్రేమాయ‌ణం..ఎలా చెడింది..?

November 19, 2021 at 11:37 am

`చిరుత` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చ‌ర‌ణ్‌.. చిరుత కంటే వేగంగా దూసుకుపోయి టాలీవుడ్‌లో స్టార్ హీరోల్లో ఒక‌డిగా స్థానాన్ని సంపాదించుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి త‌న‌యుడిగా ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయిన‌ప్ప‌టికీ.. సొంత ట్యాలెంట్‌తో మెగా ప‌వ‌ర్ స్టార్‌గా ఎదిగాడీయ‌న‌.

Chiranjeevi confirms that Ram Charan plays a key role in Acharya | Telugu Movie News - Times of India

ఈ విష‌యాలు ప‌క్క‌న పెడితే.. మొద‌టి సినిమాలో త‌న స‌ర‌స‌న న‌టించిన నేహా శర్మతో రామ్ చ‌ర‌ణ్ ప్రేమ‌లో ప‌డ్డాడ‌ట అప్ప‌ట్లో పెద్ద ఎద్దున వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఈ విష‌యం తెలుసుకున్న చిరంజీవి తీవ్ర ఆగ్ర‌హానికి గురై చ‌ర‌ణ్‌కు స్ట్రోంగ్ వార్నింగ్ ఇచ్చాడ‌ని.. దాంతో వారి ప్రేమ చెడింద‌ని కూడా ప్ర‌చారం జ‌రిగింది.

When Ram Charan answered Upasana about his marriage, honeymoon with Neha Sharma - IBTimes India

ఇక ఆ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్‌..అపోలో హాస్పిటల్ అధినేత కూతురు ఉపాసనను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చరణ్ కన్నా ఉపాసన వయసులో నాలుగు సంవత్సరాలు పెద్దది అయినప్పటికీ వీరిద్దరి అభిప్రాయాలు కలవడంతో పెద్ద‌లు వీరికి అంగ‌రంగ వైభ‌వంగా వివాహం చేశారు. దీంతో చ‌ర‌ణ్‌-నేహాల ప్రేమాయ‌ణం వార్త‌ల‌కు పులిస్టాప్ ప‌డిపోయింది.

When Ram Charan answered Upasana about his marriage, honeymoon with Neha Sharma - IBTimes India

కాగా, రామ్ చ‌ర‌ణ్ సినిమాల విష‌యానికి వ‌స్తే.. ఇప్ప‌టికే రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ఆర్ఆర్ పూర్తి చేసుకున్న ఈయ‌న ప్ర‌స్తుతం శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 15వ చిత్రాన్ని చేస్తున్నాడు. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది చివ‌ర్లో విడుద‌ల అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి.

ఆ హీరోయిన్‌తో రామ్ చ‌ర‌ణ్ ప్రేమాయ‌ణం..ఎలా చెడింది..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts