ఆ నాడు రాధిక లేకుంటే చిరంజీవి ప‌రువు పోయేది..తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి, రాధిక‌లు జంట‌గా ఎన్నో చిత్రాలు చేయ‌డంమే కాదు.. వెండితెర‌పై హిట్ పెయిర్‌గానూ గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే చిరు-రాధిక‌ల‌కు ఒకరంటే ఒకరికి అస్స‌లు ప‌డేది కాదు. అయిన‌ప్ప‌టికీ వీరిద్ద‌రూ అప్ప‌ట్లో ఇర‌వైకి పైగా చిత్రాల్లో న‌టించారు. చిరంజీవి స‌ర‌స‌న‌ అత్యధిక చిత్రాలలో హీరోయిన్ గా నటించిన క్రెడిట్ కూడా రాధికకే దక్కింది.

Ahead of Chiranjeevi's birthday, Mammootty, Rana Daggubati share striking motion poster for the megastar

ఇక మ‌రో ఆస‌క్తిక‌ర విష‌యం ఏంటంటే.. ఒకానొక సందర్భంలో చిరంజీవి పరువును రాధిక కాపాడిందంట. అవును, ఒక సినిమా షూటింగ్ స‌మ‌యంలో సన్నివేశంలో భాగంగా చిరు ఎత్తైన ప్రదేశం నుండి కిందకు దూకాల‌ట‌. అయితే అలా దూకేటప్పుడు చిరు ఫ్యాంట్ వెనక వైపు చిరిగిపోయింద‌ట‌.

రాధిక చెంపచెల్లుమనిపించిన చిరంజీవి - Chiru- Radhika slaps each other | Samayam Telugu

ఆ టైమ్‌లో యూనిట్ వాళ్లు చాలా దూరంగా ఉంటే..జ‌నాలు చుట్టూ ఉండి షూటింగ్ చూస్తున్నార‌ట‌. దాంతో చిరుకు ఏం చేయాలో అర్థం కాలేదు. అయితే ప‌క్క‌నే రాధిక ఉండ‌టంతో.. ఆమెకు విష‌యం చెప్పి పైట కొంగుతో తన ప్యాంట్ ని కవర్ చేస్తూ కిందికి తీసుకుని వెళ్ళమని చెప్పాడట.

Radhika Sarathkumar: I speak the truth and people won't like that - Rediff.com movies

అప్పుడు రాధిక చిరిగిన ప్యాంట్ ని జ‌నాలు చూడకుండా త‌న పైట కొంగు అడ్డు పెట్టి కింద‌కు తీసుకెళ్లి చిరంజీవి ప‌రువు కాపాడింద‌ట‌. మొత్తానికి ఆ నాడు రాధిక లేకుంటే చిరంజీవి ప‌రువు ప‌బ్లిక్‌గా పోయేద‌న్న‌మాట‌.