జూనియర్ ఎన్టీఆర్ నటించిన సీరియల్ పేరు ఏంటో తెలుసా..?

జూనియర్ ఎన్టీఆర్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఎంత అద్భుతంగా నటిస్తాడో మనకు తెలిసిన విషయమే. అయితే ఎన్టీఆర్ అంటే కేవలం హీరో గానే మాత్రమే అందరికీ తెలుసు. అయితే ఎన్టీఆర్ ఒక సీరియల్ లో కూడా నటించాలని విషయం కొంతమందికి మాత్రమే తెలిసి ఉండొచ్చు. అయితే ఇప్పుడు వాటి వివరాలను ఇప్పుడు చూద్దాం.

 సినిమాల విషయంలోనూ చాలా బిజీగా ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్. రాజమౌళి దర్శకత్వంలో ఈయన నటిస్తున్న ట్రిపుల్ ఆర్ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. జనవరి 7న ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్ కూడా మొదలయ్యాయి. ఇందులో కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు తారక్.

ఎన్టీఆర్ చిన్నప్పటినుంచి కళారంగంలో బాగా రాణించే వాడు. చదువు కంటే ఎక్కువగా డాన్సులు నటన పైనే ఫోకస్ చేసేవాడు. అలా 2000 సంవత్సరంలో”నిన్ను చూడాలని”సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే దీనికంటే ముందు గుణశేఖర్ డైరెక్షన్లో వచ్చిన బాల రామాయణం సినిమాలో రాముడి పాత్రలో మెప్పించాడు. ఆ తర్వాత మూడు సంవత్సరాలకి హీరో అయ్యాడు తారక్.

 సీరియల్ చేసిన తర్వాత బిగ్ బాస్ అంటూ మరోసారి ప్రేక్షకులకు చేరువయ్యాడు. ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరులు అంటూ వచ్చేసాడు. సినిమాలతో పాటు బుల్లితెరను కూడా అలాగే ప్రేమిస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్.

ఇక అసలు విషయానికి వస్తే ఎన్టీఆర్ చిన్నప్పుడే ఒక సీరియల్ లో నటించాడు. దాని పేరే భక్త మార్కండేయ. ఈ సీరియల్ గురించి చాలామందికి తెలియకపోవచ్చు. ఈటీవీ మొదలు పెట్టిన కొత్తలో ఈ సీరియల్ ప్రసారం అయినట్లు తెలుస్తోంది. అయితే ఇది కొద్దిరోజులే ప్రసారం అయినట్లు సమాచారం. ఇందులో ఎన్టీఆర్ మార్కండేయుడు గా నటించాడట. ఇప్పుడు ఆ ఫోటో వైరల్ గా మారుతోంది.