యాంకర్ సుమ సినిమాల్లోకి రాబోతోందా..? వైరల్ అవుతున్న వీడియో..!!

బుల్లితెరపై యాంకర్ సుమ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు.యాంకర్ సుమ తన కెరియర్ మొదట్లో సినిమాల్లో నటించినప్పటికీ ఆ తర్వాత నెమ్మదిగా తన నటనను తగ్గిస్తూ వచ్చింది.ఇక తన అడుగులను యాంకర్ వైపు అలా వేయడంతో ఆమె స్టార్ యాంకర్ గా మారిపోయింది.అయితే తాజాగా ఇప్పుడు ఆమె సినిమాలో నటించేందుకు అంగీకరించినట్లు గా తెలుస్తోంది. అంతేకాకుండా ఈమెను కూడా చాలామంది సినిమాల్లో నటించమని అడుగుతూ ఉండడంతో ఈమె కూడా ఒకసారి నటిస్తాం అంటూ ఒక ఫన్నీ వీడియోను షేర్ చేయడం జరిగింది.

అయితే సుమ మొదట్లో చిన్న సినిమాలలో నటించింది. కానీ ఇప్పుడు స్టార్ యాంకర్ గా ఉన్నది కనుక స్టార్ హీరోలతో నటించే అవకాశం ఎక్కువగా ఉన్నది. అందుచేతనే ఈమె ఖచ్చితంగా ఒక పెద్ద ప్రాజెక్టు లో నటించబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సుమ అభిమానులు కూడా ఈమెను వెండి తెరపై చూడాలని చాలా ఆతృతగా ఉన్నారు. ఇక ఈ మధ్య కాలంలో సుమా కొన్ని సినిమాల్లో గెస్ట్ గా కూడా వచ్చింది.అయితే ఇప్పుడు కూడా చేయబోయే సినిమా పూర్తి స్థాయిలో పాత్ర చేసే విధంగా ఉంటుందో లేదో అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు ఆమె అభిమానులు. అయితే త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వస్తుందని సమాచారం.