సుకుమార్ కి వార్నింగ్ ఇచ్చిన ఎన్టీఆర్.. ఎందుకో తెలుసా?

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో కొన్ని సందర్భాలలో హీరో హీరోయిన్ లకు, దర్శకనిర్మాతలకు, హీరో దర్శకులకు మధ్య మనస్పర్ధలు గొడవలు వస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు అవి చిన్నవిగా ఉండవచ్చు, కొన్ని సమయాల్లో పెద్దగా మరి వారి మధ్య మాట అన్నది కూడా లేకుండా పోవచ్చు. ఇండస్ట్రీలో కొందరి మధ్య మొదలైన వివాదం వల్ల వారి మధ్య మరొక సినిమా అనే ఆలోచన లేకుండా పోవచ్చు. అలా జూనియర్ ఎన్టీఆర్ ఒకసారి సుకుమార్ కి వార్నింగ్ ఇచ్చాడట.అయితే వార్నింగ్ ఇవ్వవలసిన అంత తప్పు సుకుమార్ ఏం చేశాడు? ఇది తెలుసుకుందాం..

సుకుమార్ ఎన్టీఆర్ కాంబినేషన్లో 2016లో నాన్నకు ప్రేమతో సినిమా వచ్చిన విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య చిన్న వివాదం జరిగిందట. అయితే ఈ ఈ సినిమా కోసం ఎన్టీఆర్ కు ఆ సమయంలో ఎన్ని సినిమాలు వచ్చినా కూడా వాటిని వదులుకున్నాడట.కాని సుకుమార్ మాత్రం అదే సమయంలో మరో సినిమా చేయడం కోసం ప్లాన్ చేశాడని, ఎన్టీఆర్ కాస్త బ్రేక్ ఇద్దామని అనుకున్నాడట. ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ కోపంగా సుకుమార్ తో మాట్లాడటం, ఇప్పుడు సినిమా తీస్తే నేను చేస్తాను లేకపోతే చెయ్యను అని సుకుమార్ కి గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగాయట. ఇక కుమార్ చేసేదేమిలేక వెంటనే ఎన్టీఆర్ తో నాన్నకు ప్రేమతో సినిమాను పూర్తి చేశాడట .