అవసరమైతే అది తీసేయాడనికి రెడీ అంటోన్న అనసూయ!

టాలీవుడ్‌లో చాలా మంది బుల్లితెరపై సక్సెస్ అయ్యి వెండితెరపై తమ సత్తా చాటుకున్నారు. ఇలాంటి వారిలో ఇప్పుడున్న ఆర్టిస్టుల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది జబర్దస్త్ హాట్ యాంకర్లు రష్మి, అనసూయల గురించి. వీరిద్దరు తమ అందాల ఆరబోతతో బుల్లితెరపై ఎలాంటి ఫైర్ క్రియేట్ చేశారో అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరు భామల్లో రష్మి తొలుత గ్లామర్ పాత్రల్లో నటిస్తూ వచ్చింది. అయితే క్రమంగా ఆమెకు అవకాశాలు పెద్దగా రాకపోవడంతో ఇప్పుడు మళ్లీ బుల్లితెరపైనే తన సత్తా చాటుతోంది.

ఇక మరో బ్యూటీ అనసూయ మాత్రం సినిమాల్లో చెలరేగిపోయి నటిస్తోంది. కేవలం గ్లామర్ పాత్రలే కాకుండా దొరికిన ప్రతి ఛాన్స్‌ను మిస్ చేసుకోకుండా తనదైన పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను మెప్పిస్తోంది. కాగా ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం చిత్రంలో రంగమ్మత్త పాత్ర ఆమె కెరీర్‌కు మంచి బూస్ట్ ఇచ్చిందని చెప్పాలి. అయితే ఇప్పుడు మరోసారి అదిరిపోయే పాత్ర ఆమెకు దక్కినట్లు తెలుస్తోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప చిత్రంలో దాక్షాయని అనే పవర్‌ఫుల్ పాత్రలో అనసూయ అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఇక ఈ సినిమాలోని ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేశారు.

ఈ క్రమంలో ఆమెను ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు అనసూయ ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒకవేళ ఏదైనా సినిమాలో పాత్ర కోసం గుండు చేసుకోవాల్సి వస్తే అనసూయ దానికి ఒప్పుకుంటుందా? అని సదరు అభిమాని అడగ్గా.. పాత్ర డిమాండ్ చేస్తే దేనికైనా రెడీ అంటూ ఆమె రిప్లై ఇచ్చింది. ఈ సమాధానంతో ఆమె తన సినిమాలోని పాత్రల కోసం ఎంత కష్టపడుతుందో అర్థం చేసుకోవచ్చని ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.