అమ్మో..పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో చూపించాడు గా..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం భీమ్లా నాయక్. ఈ సినిమా నుంచి నిన్నటి రోజున లాలా భీమ్లా అనే పాట విడుదల చేయడం జరిగింది. ఈ పాటకి అదిరిపోయే లిరిక్స్ రాశారు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్.

ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు మరో హీరో రానా కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాకి సాగర్ కే చంద్ర డైరెక్టర్ గా చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు సూర్యదేవర నాగ వంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. భీమ్లా నాయక్ లోని లాలా భీమ్లా మాట అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. కేవలం 24 గంటల్లోనే 10 మిలియన్ మార్క్ ను టచ్ చేసిన ఫస్ట్ సౌత్ ఇండియన్ లిరికల్ సాంగ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక తర్వాత లిస్టులో ఉన్న సినిమాల పాటల విషయానికి వస్తే..

భీమ్లా నాయక్ (లాలా భీమ్లా) – 10.2 మిలియన్స్
సామీ సామీ (పుష్ప) – 9.06 మిలియన్స్
దాక్కో దాక్కో మేక (పుష్ప) – 8.32 మిలియన్స్
భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ – 8.28 మిలియన్స్
మైండ్ బ్లాక్ (సరిలేరు నీకెవ్వరు) – 7.87 మిలియన్స్
రాములో రాములా (అల వైకుంఠపురములో) – 7.39 మిలియన్స్
శ్రీవల్లి (పుష్ప) – 6.9 మిలియన్స్.