గబ్బర్ సింగ్ సినిమాను వదులుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా ..?

2012 సంవత్సరంలో ట్రెండ్ సెట్టర్ గా మిగిలిన సినిమా గబ్బర్ సింగ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అత్యంత భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో కొత్త రికార్డులు క్రియేట్ చేసి ఏకంగా 63 కోట్ల రూపాయలను వసూలు చేసింది. అయితే ఈ సినిమా ఘన విజయాన్ని సాధించడం వెనుక విక్టరీ వెంకటేష్ ఉన్నాడని సమాచారం.

Venkatesh Daggubati charging twice his usual fees per film?

ఎక్కువగా రీమేక్ మూవీస్ చేసి హిట్స్ కొట్టిన వెంకీ కి హిందీలో హిట్ అయిన మూవీని తెలుగులో గబ్బర్ సింగ్ గా తీయడానికి ప్లాన్ చేస్తుంటే, తన కంటే పవన్ కి ఈ క్యారెక్టర్ సూటవుతుందని చెప్పాడట. దాంతో పవన్ తో తీసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు డైరెక్టర్ హరీష్ శంకర్. అలా గబ్బర్ సింగ్ విజయం వెనుక వెంకీ ఉన్నాడని తేలింది.