ఇటీవల కాలంలో మల్టీస్టారర్ చిత్రాల హవా భారీగా పెరిగిపోయింది. స్టార్ హీరోలు సైతం ఎటువంటి ఇగోలకు పోకుండా మల్టీస్టారర్ చిత్రాలు చేసేందుకు ఇంట్రస్ట్ చూపుతున్నారు. ఈ క్రమంలో ఓ క్రేజీ కాంబినేషన్ పట్టాలెక్కే అవకాశం ఉందని సినీ ఇండస్ట్రీలోకి గుసగుసలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
మహేష్ బాబు, వెంకటేష్‌లతో `సీతమ్మ వాకింట్లో సిరిమల్లె చెట్టు` వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించి మల్టీస్టారర్ చిత్రానికి మంచి ఊపు తెచ్చిన డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల.. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి-స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ల కలయికతో ఓ సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నాడట.
ఇప్పటికే చిరుకు శ్రీకాంత్ అడ్డాల ఓ కథ వినిపించగా.. అది ఆయన బాగా నచ్చిందట. అలాగే ఈ చిత్రంలో చిరంజీవితో పాటు మరో కీలకమైన పాత్ర ఉండగా, దానికి అల్లు అర్జున్ అయితే బాగుంటుందని శ్రీకాంత్ సూచించారట. అయితే అందుకు కూడా చిరంజీవి ఒకే చెప్పాడట. దాంతో ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాల బన్నీని సంప్రదించే పనిలో ఉన్నాడని తెలుస్తోంది. మరి అన్నీ కుదిరితే త్వరలోనే ఈ మెగా ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వస్తుంది.