మరో విషాదం.. మనోజ్ బాజ్ పేయి తండ్రి ఇకలేరు..!

సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది.. విలక్షణ నటుడిగా తెలుగు సినీ ఇండస్ట్రీతో పాటు హిందీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న మనోజ్ బాజ్ పేయి. ఎవరి సహాయం లేకుండా సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన ఈయన అనతికాలంలోనే ఒక మంచి నటుడిగా గుర్తింపు పొందాడు ఇక ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయానికొస్తే”ఫ్యామిలీ మ్యాన్” వెబ్ సిరీస్ తో ఉత్తరాదితో పాటు సౌత్ లో కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

ఇక అసలు విషయానికి వస్తే ..ఈయన తండ్రి రాధాకాంత్ బాజ్‌పేయి తుది శ్వాస విడిచారు.83 ఏళ్ళ వయసులో ఉన్న రాధాకాంత్ ఆరోగ్య పరిస్థితి ఇటీవల విషమించడంతో ఈరోజు ఉదయం ఢిల్లీలోని ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న ఆయన వృద్ధాప్య సమస్యలతో, ఈ లోకం నుంచి వెళ్లిపోయారు. మనోజ్ కు తల్లిదండ్రులంటే ఎంతో ప్రేమ. ఈ విషయాన్నీ ఆయన పలు ఇంటర్వ్యూలలో వెల్లడించారు. ఇక తండ్రిని పోగొట్టుకున్న మనోజ్ కుటుంబానికి బాలీవుడ్ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలియజేస్తున్నారు.