మంచు విష్ణు, ప్రకాష్ రాజ్.. సినీ ఇండస్ట్రీ లో వాళ్ళని బకరాలు చేసిన వీడియో..!

October 10, 2021 at 9:41 am

సినీ ఇండస్ట్రీలో మా ఎన్నికలు మొదలవుతున్నాయి అనే విషయం తెలిసినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎంతో రసవత్తరంగా ప్రచారం జరిగింది. మరీ ముఖ్యంగా మా అధ్యక్ష పదవికి మంచు విష్ణు ప్రకాశ్ రాజ్ పోటీ పడిన సంగతి మనకు తెలిసిందే. వీరిద్దరూ నిన్నటి రాత్రి వరకు ఒకరిమీద ఒకరు ద్వేషించు కున్నారు. ఒకరు చేసిన తప్పులు ఒకరు వేలెత్తి చూపిస్తూ పొడవడం ఇవన్నీ ప్రేక్షకులు చూసి ఆశ్చర్యపోయారు.

అయితే ఈ రోజు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మంచు మోహన్ బాబు మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ఒకరినొకరు కౌగలించుకొని ఒకరికొకరు శుభాకాంక్షలు కూడా తెలుపుతూ ఉండటంతో ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీ మొత్తం షాక్కు గురైంది. నిన్నటి రోజు వరకు వీరిద్దరూ ఒకరినొకరు తిట్టుకున్నారు. ఇప్పుడు ఇలా కలిసిపోతారు ఏంటి అంటూ..? నెటిజన్లు షాక్కు గురవుతున్నారు. ఇక సెలబ్రిటీస్ అంటే ఇంతేనేమో అంటూ పలువురు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

ఇక ప్రకాష్ రాజు కూడా మోహన్ బాబు కాళ్ళు మొక్కుతూ ఉండగా.. మోహన్ బాబు అడ్డుకున్నాడు.ఏది ఏమైనా ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠ గా ఉన్నారు ప్రేక్షకులు.

మంచు విష్ణు, ప్రకాష్ రాజ్.. సినీ ఇండస్ట్రీ లో వాళ్ళని బకరాలు చేసిన వీడియో..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts