అఖిల్ నటించిన మూవీకి.. భాస్కర్ అందుకున్న రెమ్యూనరేషన్.. అంతేనా..?

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా కోసం బొమ్మరిల్లు భాస్కర్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని విషయం ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ గా మారుతోంది. బొమ్మరిల్లు భాస్కర్ విషయానికొస్తే దిల్ రాజు నిర్మాణంలో సిద్ధార్థ జెనీలియా తో కలిసి బొమ్మరిల్లు సినిమా తెరకెక్కించాడు. దాంతో అప్పటి నుంచి ఈయనకు బొమ్మరిల్లు భాస్కర్ అని పేరు పడింది.

ఇక తాజాగా అఖిల్ పూజా హెగ్డే తో కలసి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో మంచి సక్సెస్ను అందుకున్నాడు ఈ డైరెక్టర్. ఈ సినిమా కోసం అల్లు అరవింద్ అన్నకు నెలకు 2 లక్షలు జీతం ఇచ్చే విధంగా ఒప్పుకున్నట్లు గా సమాచారం. అయితే ఈ సినిమా కోసం భాస్కర్ దాదాపుగా రెండున్నర సంవత్సరాలు కేటాయించాడు.

ఈ లెక్క ప్రకారం చూసుకుంటే దాదాపుగా 60 లక్షల పారితోషికాన్ని అందుకున్నాడు డైరెక్టర్.ఒకవేళ ఈ మూవీ హిట్ అయితే అదనంగా 40 లక్షల రూపాయల ఇవ్వవలసి ఉంటుంది అన్నా ఈ విధంగా అగ్రిమెంట్ రాసుకున్నాడట. ఇక తాజాగా ఈ సినిమా 18 కోట్ల రూపాయలకు బిజినెస్ జరగగా.. దాదాపుగా నిన్నటి రోజుకి 20 కోట్లకు పైగా వసూలు చేసింది. ఏది ఏమైనా డైరెక్టర్ భాస్కర్ అతి తక్కువ రెమ్యూనరేషన్ తీసుకొని మంచి సక్సెస్ను అందించాడని చెప్పుకోవచ్చు.