ఆచార్య వచ్చేది అప్పుడే నట..!

మెగాస్టార్ చిరంజీవి, కాజల్, రామ్ చరణ్ ముఖ్య పాత్రలో నటిస్తున్న చిత్రం ఆచార్య. ఈ సినిమా యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఉన్నారు డైరెక్టర్ కొరటాల శివ. ఇక ఈ చిత్రం విడుదల కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ తో పాటు పూజా హెగ్డే కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నది.

ఇక ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పలు వీడియోలు పాటలు సినిమా పై ఆసక్తిని పెంచేస్తున్నాయి. ఇక తాజాగా ఈ చిత్రం విడుదల తేదీపై సినీ వర్గాల్లో వినిపిస్తున్న మాట ఏమిటంటే.. ఈ చిత్రం ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

డిసెంబర్ 17వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా కూడా అదే నెలలో విడుదల తేదీ ప్రకటించినట్లు తెలుస్తోంది. అయితే త్వరలో ఏ విషయం అనేది అధికార ప్రకటన గా వెలువడే అవకాశం ఉంది.