ఆసుపత్రి పాలైన నటి.. త్వరగా కోలుకోవాలంటూ మాజీ భర్త పోస్ట్?

హిందీ పాపులర్ టీవీ నటి శ్వేతా తివారీ ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. ఇటీవల ఈమె ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటోంది. ఈ విషయంపై ఈమె త్వరలో కోలుకోవాలని అంటూ ఆమె మాజీ భర్త ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. నా కొడుకు కస్టడీకి సంబంధించిన విషయం ప్రస్తుతం కోర్టులో ఉంది, కానీ శ్వేత త్వరగా కోలుకోవాలని దేవుని ప్రార్థిస్తున్నాను.

చాలామంది యాక్టర్స్ ప్రేక్షకుల ముందు తమను తాము మరింత అందంగా చూపించుకునేందుకు తక్కువగా తిని ఎక్కువగా వర్క్వుట్స్ చేస్తూ శరీరాన్ని ఒత్తిడికి గురి చేస్తారు.ఇలాంటి సందర్భాలలో ఏదో ఒక రోజు వాళ్ల గుండె అలిసిపోతుంది అంటూ అతడు తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.నటి శ్వేతా తివారి బలహీనత, అలాగే లోబీపీ కారణంగా హాస్పిటల్ పాలైంది.

https://www.instagram.com/p/CUaSEwmMnNn/?utm_source=ig_web_copy_link

షూటింగ్ లో బిజీగా ఉంటూ తగినంత విశ్రాంతి తీసుకోక పోవడంతో ఆమె అనారోగ్యానికి గురైన పీఆర్ టీమ్ సోషల్ మీడియా వేదికగా తెలిపింది. అయితే ఈ ఏడాది ఆరంభంలో శ్వేత తివారీ భర్త అభినవ్ తో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అప్పట్లో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.