తన తల్లి ముందే అన్నపూర్ణమ్మ ను కొట్టారట.. కారణం తెలిస్తే షాక్..?

టాలీవుడ్ లోకి దాసరి నారాయణ డైరెక్షన్ లో వచ్చిన చిత్రం.. స్వర్గం,నరకం అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది నటి అన్నపూర్ణ.1975 సంవత్సరంలో వచ్చిన ఆ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అంతేకాకుండా సినిమా తో ఆమెకు నంది అవార్డు కూడా గెలుచుకుంది.ఆ తరువాత ఎన్నో సినిమాలలో ఈమె హీరోయిన్గా కూడా నటించింది. ఇక రాను రాను కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇవ్వడంతో ఆమె హవా తగ్గింది అని చెప్పుకోవచ్చు.

 

ఇక ఆ తర్వాత తల్లిగా, అత్తగా, బామ్మ గా ఎన్నో సినిమాలలో గుర్తుండిపోయే పాత్రను చేసింది అన్నపూర్ణ. ఈమె ఇప్పటివరకు150కి పైగా సినిమాలలో నటించింది. ఇక ఈమె తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా నటించింది.ఒకానొక సమయంలో అన్నపూర్ణమ్మ గారిని ఒక చెట్టుకు కట్టేసి తన తల్లి ముందే కొట్టారంటూ ఒక విషయాన్ని తెలియజేసింది అన్నపూర్ణమ్మ.

తను చిన్న వయసులో ట్యూషన్ కి వెళ్లేటప్పుడు..ఆ ట్యూషన్ లోనే ఒక మాస్టారు తన ఇంటి పక్కన ఉండే ఓ అమ్మాయి కి ఉత్తరాలు ఇవ్వమంటూ ఇచ్చేవారట.అలా కొన్ని రోజుల పాటు నేను అతని ఉత్తరాలు ఆమెకు ఇస్తూ ఉండడం జరిగింది. అలా ఒకరోజు ఆ ఉత్తరాన్ని ఆ అమ్మాయికి ఇచ్చేటప్పుడు..విషయం తెలుసుకున్న ఆ ఇంట్లో వారు. అన్నపూర్ణమ్మ ను చెట్టుకు కట్టేశారు. అన్నపూర్ణమ్మ అమ్మకు చెబితే ఏం పర్వాలేదు కొట్టండి వెధవ వేషాలు వేస్తోందిఅంటూ తెలియ చెప్పినట్లు ఆమె ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది.