స్పోర్ట్స్ వేర్ ప్రమోషన్స్ తో ముందుకొచ్చిన సారా టెండూల్కర్..!

September 22, 2021 at 3:12 pm

సారా టెండూల్కర్.. క్రికెట్ కి గాడ్ ఫాదర్ గా గుర్తింపు పొందిన సచిన్ టెండూల్కర్ ఆయన సతీమణి అంజలి టెండూల్కర్ ల గారాలపట్టి సారా టెండూల్కర్.. తాజాగా సారా టెండూల్కర్ తన స్నేహితుడు స్పోర్ట్స్ వేర్ వెంచర్ ని ప్రమోట్ చేస్తూ ఆ జిమ్ కి సంబంధించిన స్పోర్ట్స్ వేర్ ను ధరించి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది..

సాధారణంగా సారా టెండూల్కర్ ఎప్పటికప్పుడు తన సరికొత్త లుక్కుతో అలరించి , ఆ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్న విషయం తెలిసిందే.అయితే తాజాగా తన ఫ్రెండ్ కోసం ఇలా జిమ్ అవతారం ఎత్తడం తో ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.. ఈ విషయం తెలుసుకున్న బాలీవుడ్ ఫంక్ అర్జున్ కపూర్ తో పాటు కార్తీక్ ఆర్యన్ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాదు వీరిద్దరూ కలిసి సారా టెండూల్కర్ పై ప్రశంసల వర్షం కురిపించారు..

ఇకపోతే సారా ఈ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ.. నా ఫ్రెండ్ డాల్జి రూపొందించిన ఆక్టివ్ వేర్ స్పోర్ట్స్ వేర్ బ్రాండ్ ను నేను ఒక సంవత్సరం నుంచి ఉపయోగిస్తున్నాను.. నేను ధరించిన లెగ్గిన్స్ కూడా చాలా బాగా మన్నిక వస్తాయి ..అంతేకాకుండా కంఫర్ట్ కూడా ఉంటుంది.. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ కొనుగోలు చేయండి అంటూ ఆమె హాష్ ట్యాగ్ తో షేర్ చేసింది. అంతేకాదు SARATEN అనే కోడ్ నీ కూడా ఉపయోగించి ,కొనుగోలు చేసినట్లయితే 15% క్యాష్బ్యాక్ కూడా లభిస్తుంది అంటూ ఆమె తెలిపింది.

స్పోర్ట్స్ వేర్ ప్రమోషన్స్ తో ముందుకొచ్చిన సారా టెండూల్కర్..!
0 votes, 0.00 avg. rating (0% score)