ఆ షోకి మహేష్ తర్వాత ఎంట్రీ ఇవ్వనున్న ప్రభాస్?

September 22, 2021 at 2:51 pm

ప్రస్తుతం బుల్లితెరపై రెండు షోలు మంచి రసవత్తరంగా సాగుతున్నాయి. ఒకటి బిగ్ బాస్ షో గా మరొకవైపు ఎవరు మీలో కోటీశ్వరులు షో. ఈ రెండు షోలు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నాయి. భారీగా టిఆర్పి రాబడి తో బుల్లితెర ఆడియన్స్ కి వినోదాన్ని అందిస్తున్నాయి. ఇక ఎవరు మీలో కోటీశ్వరులు షో విషయానికి వస్తే ఎపిసోడ్ ఎపిసోడ్ కు సెలబ్రిటీలను తీసుకొస్తూ ఈ షోను ఆద్యంతం రక్తి కట్టిస్తున్నారు. ఇక ఈ షో కి హోస్టుగా జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

ఇక ఇప్పటికే ఈ షోకి రామ్ చరణ్, దర్శకుడు రాజమౌళి, కొరటాల శివ హాజరయ్యారు. ఇక వీరికి ఎన్టీఆర్ తనదైన శైలిలో ప్రశ్నలు వేస్తూ, మధ్య మధ్యలో నవ్విస్తూ వచ్చినవారిని ఆడిస్తున్నారు తారక్. ఇక తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ షో కి మరో ఇద్దరు స్టార్ హీరోలు రాబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వచ్చే వారం ఎవరు మీలో కోటీశ్వరులు షో లో ప్రిన్స్ మహేష్ బాబు హాట్ సీట్లో కూర్చోబోతున్నారని సమాచారం. ఒకవైపు ఈ విషయం అభిమానుల్లో ఆనందాన్ని కలిగిస్తుండగా, మరోవైపు మహేష్ బాబు తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ ఈ షో కి రాబోతున్నారు అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అందుకు షో నిర్వాహకులు అదే దిశగా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఒకవేళ ఇదే కనుక నిజం అయితే ప్రభాస్, మహేష్ షో కి వస్తే అభిమానులకు పండగే పండగ.

ఆ షోకి మహేష్ తర్వాత ఎంట్రీ ఇవ్వనున్న ప్రభాస్?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts