ఆ హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటానన్న సింగర్ మనో?

సింగర్ మనో.. తెలుగు సినీ ఇండస్ట్రీ లో ఉన్న సింగర్ లలో ఈయన కూడా ఒకరు.ఇతను సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, నటుడిగా ఇలా ఎన్నో రంగాల్లో రాణిస్తూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నారు. రజనీకాంత్ సూపర్ స్టార్ హీరో కు డబ్బింగ్ వాయిస్ చెప్పింది మనో నే. సింగర్ మనో అసలు పేరు నాగూర్ బాబు. కాకపోతే ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా నాగూర్ బాబు పేరును కాస్తా మనో గా మార్చారు. ఇక సింగర్ మనో కి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టిన సమయంలో ఇంట్లో వారికి నేను పెళ్ళంటూ చేసుకుంటే హీరోయిన్ మాత్రమే చేసుకుంటారు అని వాదించే వాడట.

ఆ హీరోయిన్ ఎవరో కాదు గీత. తల్లిదండ్రులు ఎక్కడెక్కడో వెతికి అచ్చం హీరో లా ఉండే అమ్మాయిని వెతికి పట్టి మరి మనో కి ఇచ్చి పెళ్లి చేశారు. 19 ఏళ్ల వయసులోనే లోకి జమీలా అనే అమ్మాయి తో పెళ్లి జరిగింది. మనో భార్య జమీలా ది తెనాలి. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు కాగా, ఇద్దరు కుమారులు ఒక కుమార్తె. మనో పెళ్లికి సాక్షాత్తుగా వీరి గురువు కే చక్రవర్తి గారు అలాగే ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు వచ్చి సంతకాలు చేశారట. ఆ సమయంలో హీరోయిన్ గీత మనో భార్య జమీలా ను చూసి అచ్చం నా చెల్లి లా ఉన్నావు అని చెప్పిందట.