స‌మంత‌తో ఒక‌సారైనా అలా చేయాలి..స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్‌!

టాలీవుడ్ టాప్ హీరోయిన్‌, అక్కినేని వారి కోడ‌లు స‌మంత న‌ట‌న గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఏ పాత్ర చేసిన ది బెస్ట్ ఇచ్చేస్తుంది సామ్‌. ముఖ్యంగా సమంత నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ ఈ మ‌ధ్య విడుద‌లై సంచలన విజయాన్ని అందుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ సిరీస్‌‌‌‌లో రాజీ అనే నెగెటివ్ పాత్రలో స‌మంత అద‌ర‌గొట్టేసింది.

Shahid Kapoor opens up on his OTT debut | Hindi Movie News - Times of India

ఆమె పాత్రలో మరొకరని ఊహించటం కష్టం. అంతలా పాత్రలోకి వెళ్లిపోయింది. అయితే తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ క‌పూర్ తాజాగా అభిమానులతో చాటింగ్ సెషన్‌లో పాల్గొన‌గా.. ఓ నెటిజ‌న్ ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ గురించి అడిగాడు. దీనిపై షాహిద్ మాట్లాడుతూ ఫ్యామిలీ మ్యాన్ 2 నాకు చాలా బాగా నచ్చిందని, ముఖ్యంగా స‌మంత త‌న న‌ట‌న‌తో మిస్మ‌రైజ్ చేసిందని చెప్పుకొచ్చారు.

Samantha locks herself in a room for three days!

అంతేకాదు, ఒక‌సారైనా ఆమెతో క‌లిసి నటించాలని ఉందని తన మనసులో మాట బయటపెట్టాడు. ఇక షాహిద్ స‌మంతతో న‌టించాల‌నుంద‌ని చెప్ప‌డంతో చాలా మంది ఆశ్చ‌ర్య‌పోతున్నారు. కాగా, షాహిద్ ప్ర‌స్తుతం గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో `జెర్సీ` రీమేక్ చేస్తున్నాడు. ఈ మూవీని 2021 డిసెంబ‌ర్ 31న విడుద‌ల చేయ‌బోతున్నారు.