ఆ రెండు కుటుంబాల వల్లే ఆర్తి అగర్వాల్ కెరీర్ అలా అయ్యిందా?

హీరో తరుణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు హీరోగా ఓ వెలుగు వెలిగిన తరుణ్ ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు. అయితే ఆ సమయంలోనే హీరో తరుణ్ ఆర్తి అగర్వాల్ తో ప్రేమలో పడినట్లు వార్తలు కూడా వినిపించాయి. ఆర్తి అగర్వాల్ కూడా తరుణ్ ప్రేమించినట్లు ఈ వార్తలు చక్కర్లు కొట్టాయి. హీరో తరుణ్ తల్లిచాటు కొడుకు. తరుణ్ తల్లి తన కొడుకు తన మాటను జవదాటడు, తాను చెప్పిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడు అంటుంది. మరి తల్లిచాటు కొడుకు అయినప్పుడు తరుణ్ అలాగే ఆర్తి అగర్వాల్ మధ్య ప్రేమను మొదట్లో తుంచి వేయాల్సింది.

ఇక ఆర్తి అగర్వాల్ విషయానికి వస్తే ఆర్తి అగర్వాల్ తో పాటు ఈమె చెల్లెలు అతిథి అగర్వాల్ కూడా హీరోయినే. తెలుగులో వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావ్ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోలందరి సరసన నటించింది. అప్పట్లో ఉన్న ఉదయ్ కిరణ్,తరుణ్ సరసన కూడా నటించింది. తరుణ్ తో ఆర్తి అగర్వాల్ లో ప్రేమలో పడిన సమయంలో ఏ ఒక్క సినీ పెద్ద మాట్లాడకపోవటంతో డిప్రెషన్ కు గురై ఆత్మహత్యకు పాల్పడింది. ఆ తర్వాత విపరీతంగా బరువు పెరిగి పోయింది. ఆ తరువాత వారి తల్లిదండ్రుల బలవంతం మీద ఆపరేషన్ చేయించుకుంది. ఆపరేషన్ వికటించడం వల్ల అన్న విషయం అందరికి తెలిసిందే. ఇలా ఆర్తి అగర్వాల్ జీవితం తన కుటుంబ సభ్యులు, అలాగే కుటుంబ సభ్యులు వల్ల నాశనమైందని చెప్పాలి.