నటి దివ్యభారతి మరణం వెనుక ఎవరికి తెలియని అసలు నిజం ఇదే!

నటి దివ్యభారతి 16 సంవత్సరాల వయసులోనే సినీ ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తన జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోలేదు. అలా అప్పట్లోనే హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతూ రోజుకి లక్ష రూపాయలు పరితోషికంగా తీసుకునేది. అయితే దివ్యభారతి1993 ఏప్రిల్ 5 న క‌న్నుమూసింది. టీనేజ్ స్టార్‌ దివ్యభారతి ఆత్మహత్య చేసుకుంద‌నే వార్త‌ను ఎవ‌రూ న‌మ్మ‌లేక‌పోయారు. ఎవరో కావాలనే ఆమెను హతమార్చారు అంటూ కొందరు అనుమానాలు లేవనెత్తారు. కానీ దివ్యభారతి చ‌నిపోయిన రోజున చాలా హుషారుగా ఉందని చెబుతారు దగ్గరనుంచి చూసినవాళ్లు. చెన్నై నుంచి షూటింగ్‌ పూర్తి చేసుకుని ముంబై చేరుకున్న ఆమె తన సంపాదనతో ఓ అపార్ట్‌మెంట్‌లోని ఇంటిని కొనుగోలు చేయాలని భావించి సోదరుడు కునాల్‌తో కలిసి ఆ నాలుగు పడకగదుల ఇంటిని సందర్శించింది. దివ్య భారతికి నిర్మాత సాజిద్‌ నదియాడ్‌వాలాతో వివాహ‌మైంది. వీరిద్ద‌రు కలిసి అంధేరీ ప్రాంతంలోని తులసీ అపార్ట్‌మెంట్లో నివసిస్తున్నారు.

దివ్యభారతి బెడ్‌రూమ్‌లోకి చేరి, కాసేపు నడుం వాల్చగానే ప్రముఖ డిజైనర్‌ నీతా లుల్లా నుంచి ఫోన్‌ వచ్చింది. తన భర్త శ్యామ్‌ లుల్లాతో కలిసి తులసీ అపార్ట్‌మెంట్‌కు వచ్చారు. వీరు హాల్ లో టీవీ చూస్తుండగా దివ్య మాట్లాడుతూనే బాల్కనీ వైపు నడుచుకుంటూ వెళ్లింది.బాల్కనీలోని తలుపుల్లేని కిటికీ ముందు నిల్చుంది దివ్యభారతి.ఐదో అంతస్తు నుంచి పెద్ద శబ్దం చేస్తూ కింద పడిపోయింది. అంతే రక్తపు మడుగులో దివ్యభారతి కొట్టుమిట్టాడుతోంది. ఆలస్యం చేయకుండా అంబులెన్స్‌కు రావ‌డం అలా కొద్ది సమయంలోనే దగ్గర్లోని ఆస్పత్రికి ఆమెను చేర్చారు. అయితే, హాస్పిటల్‌లోకి అడుగుపెట్టగానే ఆమె ప్రాణాలు కోల్పోయింది.దీనిపై నీతా, శ్యామ్‌ లుల్లాలు ఏరోజూ నోరు మెదపలేదు. ఏళ్లు గడిచినా ముంబై పోలీసులు మాత్రం ఎలాంటి ఆధారాలూ సంపాదించలేకపోయారు.