బిగ్‌బాస్‌-5: రెండో వారంలో బ్యాగ్ స‌ద్దేస్తున్న కంటెస్టెంట్ ఎవ‌రంటే?

September 15, 2021 at 2:57 pm

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 5 రెండో వారానికి చేరుకున్న సంగ‌తి తెలిసిందే. మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లోకి అడుగు పెట్ట‌గా.. మొద‌టి వారం 7 ఆర్ట్స్ స‌ర‌యు ఎలిమినేట్ అయిపోయింది. ఇక రెండో వారంలో నటరాజ్, కాజల్, ఉమ‌, లోబో, ప్రియాంక, యాని, ప్రియ ఎలిమినేష‌న్‌కు నామినేట్ అయ్యాయి.

Bigg Boss Telugu 5: Uma Devi and six others get nominated for eviction in week 2 - Times of India

అయితే వీరిలో కార్తీక‌దీపం సీరియ‌ల్ ఫేమ్ ఉమ‌నే బ్యాగ్ స‌ద్దేయ‌బోతోంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇందుకే ప్ర‌ధాన కార‌ణం ఆమె ప్ర‌వ‌ర్త‌న‌నే. హౌస్‌లోకి వ‌చ్చిన మూడో రోజు నుంచే ఉమ‌.. చీటికి మాటికి గొడ‌వ‌లు పెట్టుకుంటూ అంద‌రిపై నోరు పారేసుకుంటుంది.

Uma in Bigg Boss Telugu 5 : భర్తతో విభేదాలు.. ఏడ్చేసిన ఉమా, గయ్యాళి అంటూ నాగ్ కామెంట్స్! | Bigg Boss Telugu 5 contestant Uma Devi Age, Husband, Family and Biography - Telugu Filmibeat

బూతులు మాట్లాడేందుకు కూడా ఉమ ఏ మాత్రం వెన‌కాడ‌టం లేదు. దాంతో ఇంటి స‌భ్యులెవరు కూడా ఉమ సరిగ్గా మెలగలేకపోతున్నారు. ఈ నేప‌థ్యంలోనే సెకెండ్ వీక్ ఎలిమినేట్ అయ్యేది ఉమ‌నే అంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. ఒక‌వేళ పొర‌పాటున ఉమ సేవ్ అయితే.. కాజల్ ఇంటి స‌భ్యుల‌కు గుడ్ బై చెప్పేసే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి.

బిగ్‌బాస్‌-5: రెండో వారంలో బ్యాగ్ స‌ద్దేస్తున్న కంటెస్టెంట్ ఎవ‌రంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts