నిందితుడిని పాటించిన వారికీ అదిరిపోయే బహుమతి ప్రకటించిన.. ఆర్పీ పట్నాయక్​..!

September 15, 2021 at 3:09 pm

ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్​ సామాజిక అంశాల పట్ల కూడా చురుగ్గా ఉంటాడన్న విషయం తెలిసిందే. ఇటీవల సాయిధరమ్​ తేజ్​ రోడ్డు ప్రమాదం విషయంలోనూ ఆర్పీ పట్నాయక్​ స్పందించారు. రోడ్డుపై ఇసుకు పేరుకుపోయినా పట్టించుకోని మున్సిపల్​ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలంటూ వ్యాఖ్యానించారు. ఆర్పీ వ్యాఖ్యల పట్ల సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

ఇదిలా ఉంటే ఇటీవల సైదాబాద్​లోని సింగరేణి కాలనికి చెందిన ఓ చిన్నారి .. అత్యాచారం, హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ దారుణానికి పాల్పడ్డ నిందితుడిని ఇంత వరకు పోలీసులు పట్టుకోలేదు. దీంతో నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే నిందితుడికి సంబంధించిన ఫొటోను పోలీసులు విడుదల చేశారు. అతడి పేరు రాజు.. అని అతడికి చేతి మీద మౌనిక అనే పేరుతో ఓ ట్యాటూ ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితుడిని పట్టించిన వారికి రూ. 10 లక్షలు రివార్డు కూడా ప్రకటించారు.

తాజాగా ఈ విషయంపై ఆర్పీ స్పందించారు. ‘సైదాబాద్​ నిందితుడిని పట్టుకొనేందుకు అంతా సహకరించండి. నిందితుడిని పట్టిస్తే నేను కూడా రూ. 50 వేలు ఇస్తా. అతడి చేతికి ట్యాటు ఉంది. అది తప్పకుండా పట్టిస్తుంది. దయచేసి మీ చుట్టుపక్కల గమనించండి. కిరాతకుడిని పట్టుకొనేందుక మనమూ సహకరిద్దాం’ అంటూ ఆర్పీ ఓ పోస్ట్​ పెట్టారు.
సైదాబాద్​ చిన్నారి ఘటన పట్ల సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. సోషల్​ మీడియా వేదికగా ఈ ఘటనపై పోస్టులు పెడుతున్నారు. ఇటీవల మంచు మనోజ్​ .. చిన్నారి కుటుంబసభ్యులను పరామర్శించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మహేష్, నాని కూడా స్పందించారు.

నిందితుడిని పాటించిన వారికీ అదిరిపోయే బహుమతి ప్రకటించిన.. ఆర్పీ పట్నాయక్​..!
0 votes, 0.00 avg. rating (0% score)