పవర్ లేనివాడికి పవర్ స్టార్ ఎందుకయ్యా అంటున్న ఆయనా..?

పవన్ కళ్యాణ్ అభిమానులంతా పవర్ స్టార్ అని పిలుస్తూ ఉంటారు.అయితే మొన్న పవరు స్టార్ పేరును తీసేయమని పవన్ కళ్యాణ్ నిర్మాతలకు తెలియజేసినట్లు వార్తలు బయటకు వచ్చాయి. అందుకే భీమ్లా నాయక్ టీజర్ పోస్టర్ లో ఎక్కడ కూడా పవర్ స్టార్ అని పేరు లేకుండా చాలా జాగ్రత్త పడ్డారు. పవన్ కళ్యాణ్ స్వయంగా పవర్ స్టార్ అనే బిరుదును తీసేయమని చెప్పడం నిజమేనా అనే సందేహాలు కలిగాయి ఆ పోస్ట్ ర్ చూసిన తర్వాత.

తాజాగా సాయి ధరంతేజ్ రిపబ్లిక్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు పవన్ కళ్యాణ్. ఈ ఈవెంట్ లో స్పీచ్ తో అదరగొట్టాడు పవన్ కళ్యాణ్.అక్కడున్న పవన్ కళ్యాణ్ అభిమానులు పవర్ స్టార్ అంటూ గోల గోల చేశారు. యాంకర్ సుమ కూడా పవన్ ను స్టేజి పైకి పిలిచినప్పుడు పవర్ స్టార్ అనే ఆహ్వానించింది.

ఇక దాంతో పాటు అభిమానులు కూడా సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తూనే ఉన్నారు. దాంతో పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. ఫ్యాన్స్ అందరు పవర్ స్టార్ అంటున్నారు.. సుమా గారు కూడా పవర్ స్టార్ అని పిలిచారు.. పవర్ లేనివాడికి పవర్ స్టార్ ఎందుకయ్యా తీసేయండి అంటూ పవన్ కళ్యాణ్ చిరునవ్వుతో తెలియజేశాడు.అందుచేతనే పవర్ స్టార్ అనే పదాన్ని తొలగించామని పవన్ కళ్యాణ్ చెప్పినట్లు తెలియజేశారు.