ఖరీదైన కారుని విడిచి ఆటో లో ప్రయాణించిన.. శ్రద్ధ కపూర్?

బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రెండేళ్ల వరకు సెన్సేషనల్ బ్యూటీ గా నిలిచిన ఈ భామకు ఈ మధ్యకాలంలో క్రేజ్ తగ్గిందని చెప్పవచ్చు . కానీ ఈమె మాత్రం నిత్యం సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తన అందాలతో కుర్రకారుకి పిచ్చెక్కిస్తూ ఉంటుంది. ఇక ఇది ఇలా ఉంటే శ్రద్ధా కపూర్ ఖరీదైన కారు ఉన్నప్పటికీ ఒక సాధారణ అమ్మాయిల ఆటోలో ప్రయాణం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోని షేర్ చేసుకోగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియోని షేర్ చేస్తూ దానికి లవ్ సింబల్ ను జోడించింది. ఒక సెలబ్రిటీ అయ్యుండి ఒక సాధారణ అమ్మాయిల ఆటోలో ప్రయాణించడం పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. శ్రద్ధ చేసిన పనికి తన అభిమానులు ఫిదా అవుతున్నారు. ఒక అభిమాని అయితే నేను కూడా అదే ఆటోలో ఉంటే బాగుండేది అంటూ వీడియోని రీ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈమె నిఖిల్ ద్వివేది నాగిని సీరియల్ ఆధారంగా నిర్మించనున్న సినిమాకు సైన్ చేసింది.