ఎన్టీఆర్ ను కించపరిచిన రాజమౌళి..కారణం..?

రాజమౌళి .. ఎన్టీఆర్ ను ఒక మాట అన్నారని, ఇది కాస్త సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారిన విషయం తెలిసిందే.. అది ఏమిటంటే ఎన్టీఆర్ చాలా లావుగా ఉన్నాడు.. అని, చూడటానికి చాలా అసహ్యంగా కనిపిస్తున్నాడు అని అనడంతో ఈ వార్త కాస్త నెట్టింట్లో వైరల్ గా మారింది..

ఇకపోతే ఎవరైతే బరువు తగ్గాలని అనుకుంటున్నారో, అలాంటి వారికి ఎన్టీఆర్ ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పవచ్చు . ఎందుకంటే రాఖీ సినిమా వరకు ఎన్టీఆర్ ఎంత లావుగా ఉన్నాడో మనం చూసిన విషయమే.. అయితే ఒక్కసారిగా యమదొంగ సినిమా కోసం 30 కేజీల బరువు తగ్గి , ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. తర్వాత కంత్రి సినిమాకి వస్తే, ఆయన బరువు కేవలం 50 కేజీలు మాత్రమే అని చెప్పవచ్చు.. అంతలా బరువు తగ్గడంలో తనకు మించి మరొకరు వర్కౌట్స్ చేయరు అని కూడా చెప్పవచ్చు..

తన సినిమాల కోసం బరువు తగ్గే కాన్సెప్ట్ ను ఎన్టీఆర్ కు రాజమౌళి నేర్పించాడు అని చెప్పవచ్చు.. అయితే ఇటీవల ఎన్టీఆర్ మాట్లాడుతూ.. నేను చాలా లావుగా ఉన్నప్పటికీ ,ఏ రోజు కూడా నేను చాలా లావుగా ఉన్నాను అని బాధ పడలేదు ..కానీ ఒకరోజు జక్కన్న చాలా అసహ్యంగా ఉన్నావు.. అని అన్నారు. అప్పుడే నాకు కొంచం వెలిగింది.. మనల్ని గైడ్ చేయాలి అంటే మన చుట్టుపక్కల ఉండే ఫ్రెండ్స్ మాత్రమే , మనల్ని చక్కగా గైడ్ చేయగలరు.. ఆ రోజు నుంచే నేను బరువు తగ్గే ప్రయత్నం కూడా చేశాను అని ఎవరు మీలో కోటీశ్వరులు షో ద్వారా ఎన్టీఆర్ తెలిపాడు..

అంతేకాదు సినిమాలలోకి ఎవరైతే రావాలి అనుకుంటున్నారో.. అలాంటివారు చాలా నిజాయితీగా ఉండమని, చాలా తెలుసు అని అనుకుంటాము కానీ ఏమీ తెలియదు అని , నేర్చుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి అని ఎన్టీఆర్ తెలిపాడు.