పెళ్లి త‌ర్వాత నో సినిమాలు..ముందే క్లారిటీ ఇచ్చేసిన న‌య‌న‌తార‌!

దక్షిణాది లేడి సూపర్ స్టార్ నయనతార త్వ‌ర‌లోనే కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ను పెళ్లాడ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఎప్ప‌టి నుంచో ప్రేమ‌లో ఉన్న ఈ జంట‌.. ఇప్ప‌టికే గ‌ప్‌చుప్‌గా నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. అయితే నయనతారకు పెళ్లి ఫిక్స్ అయిందని తెలియ‌గానే.. ఆమె అభిమానుల్లో ఓ కంగారు మొద‌లైంది.

Nayanthara,Vignesh celebrate 5 years long love story, see pics | Nayanthara and Vignesh Shivan

ఇంత‌కీ కంగారెందుకు అంటే..ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో తెలుగు, త‌మిళ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా చ‌క్రం తిప్పుతున్న న‌య‌న్ పెళ్లి త‌ర్వాత కూడా న‌టిస్తుందా..? లేక నో సినిమాల‌ని గుడ్‌బై చేప్పేస్తుందా..? అన్న అనుమానాలు చాలా మందిలో మొద‌ల‌య్యాయి. అయితే ఈ విష‌యంపై న‌య‌న్ ముందే క్లారిటీ ఇచ్చింది.

Vignesh Shivan rings in 35th birthday with girlfriend Nayanthara in Goa. See pics - Movies News

తను నటనను వదిలిపెట్టే ప్రసక్తి లేదని, పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తాన‌ని, తన సినీ కేరీర్‌కు వచ్చిన ఇబ్బంది ఏమి లేదని తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఆమె స్ప‌ష్టం చేసింది. కాగా, ప్ర‌స్తుతం న‌య‌న్ విఘ్నేష్‌ శివ‌న్ దర్శ‌క‌త్వంలో `కాతువాకుల రెండు ఖాదల్` అనే మూవీ చేస్తోంది. అలాగే ఇటు తెలుగులోనూ ప‌లు ప్రాజెక్ట్స్‌ను టేక‌ప్ చేసింది.