నాగచైతన్య సినిమాని రిజెక్ట్ చేసిన తమన్నా కారణం..?

సినీ ఇండస్ట్రీలో మిల్కీబ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నది.మొదటిసారిగా మంచు మనోజ్ తో” శ్రీ ” సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. నటించిన మొదటి సినిమా డిజాస్టర్ ని చవిచూసింది.

ఇక తెలుగులో శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన హ్యాపీడేస్ చిత్రం ద్వారా మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది తమన్నా.ఈ సినిమా సక్సెస్ తో వరుస ఆఫర్లు వస్తున్న క్రమంలో నాగచైతన్య సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసేందుకు జోష్ సినిమా ఆఫర్ రాగా ఆమె నాగచైతన్యతో నటించడానికి ఒప్పుకోలేదట.కానీ ఆ అవకాశం రాధ కూతురు కార్తీక కి సొంతం చేసుకుంది.

Naga Chaitanya Movies | 10 Best Films You Must See - The Cinemaholic

తమన్నా ఈ సినిమా వదులుకోవడానికి ముఖ్య కారణం ఆమె వరుస సినిమాలో బిజీగా ఉండి ఖాళీ డేట్స్ లేక పోవడం వల్లే అన్నట్లుగా ఒక సందర్భంలో తెలిపింది. కానీ ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర బాగానే విజయం అందుకుంది.ఇక ఆ తరువాత 100%లవ్ సినిమా తో వీరిద్దరూ మంచి సక్సెస్ ను అందుకున్నారు. ఆ తర్వాత తడాఖా సినిమాలో నటించారు ఈ సినిమా కూడా పర్వాలేదు అనిపించుకుంది.అలా నాగచైతన్యతో మొదటి సినిమా అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చింది ఈ ముద్దుగుమ్మ.