బర్త్ డే సర్ ప్రైజ్.. ఆ సినిమాలో అలాంటి పాత్రలో చేస్తున్న చిన్మయి?

సింగర్ చిన్మయి ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె సామాజిక మాద్యమాల్లో ఎప్పుడు చాలా యాక్టివ్ గా ఉంటూ, మహిళలపై జరుగుతున్న దాడుల విషయంలో తరచూ స్పందిస్తూనే ఉంటారు. అలాంటి వాటిని వెంటనే ఖండిస్తూ వార్తల్లో ఉంటారు.అంతే కాకుండా ప్లే బ్యాక్ సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా ఫేమస్ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇది ఇలా ఉంటే త్వరలోనే చిన్మయి నటిగా కూడా వెండితెరపై మెరవనుంది. భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రూపొందుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో అఖిల్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది.

అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్ లు, టీజర్ లు విడుదల అయ్యి దర్శకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో సింగర్ చిన్మయి కూడా ఒక పాత్రలో నటిస్తోంది. ఈరోజు సినిమా ఈ బర్త్ డే సందర్భంగా ఆమె ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఒక పోస్టర్ కూడా విడుదల చేశారు. ఈ సినిమా అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక చిన్మయికి అక్కినేని ఫ్యామిలీ తో ఉన్న అనుబంధం గురించి మన అందరికి తెలిసిందే. ఈమె స్టార్ హీరోయిన్ సమంతకు డబ్బింగ్ చెబుతూ ఉంటుంది.