కోలుకున్న న‌టుడు విజయ్ కాంత్..న‌ర్సుల‌తో ఎంజాయ్‌..!

తమిళ స్టార్ హీరో, డీఎండీకే పార్టీ అధినేత విజయ్ కాంత్ గ‌త కొద్ది రోజులుగా అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. దాంతో ఆయ‌న ఆరోగ్యంపై అనేక పుకార్లు షికార్లు కొట్టాయి. ఇక రీసెంట్‌గా విజయ్ కాంత్ చికిత్స కోసం చెన్నై నుంచి దుబాయ్ వెళ్లిడంతో..ఆయన పరిస్థితి విషమించింద‌ని ఎన్నో వార్త‌లు పుట్టుకొచ్చాయి.

துபாயில் மொபைலில் சூப்பர் ஹிட் பட பார்த்த விஜயகாந்த்... என்ன படம் தெரியுமா? | Vijayakanth shared a pic of watching super movie sathriyan - Tamil Filmibeat

అయితే ప్రస్తుతం ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా విజ‌య్ కాంత్‌నే తెలియ‌జేశారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని డీఎండీకే అధినేత విజయకాంత్‌ ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు.

అంతేకాదు, తాను నటించిన క్షత్రియన్ చిత్రాన్ని ఆస్పత్రి నర్సు లతో కలిసి చూస్తూ.. ఎంజాయ్ చేస్తున్న ఫొటోను సైతం విడుదల చేశారు. ఇక విజ‌య్ కాంత్ కోలుకుంటుండ‌డంతో డీఎండీకే వర్గాలు ఆనందం వ్యక్తం చేశాయి. కాగా, నటుడిగా క్రేజ్ తెచ్చుకున్న విజయ్ కాంత్ రాజకీయాల్లోకి ప్రవేశించి 2005లో సొంతంగా డీఎండీకే పార్టీని స్థాపించారు. తమిళ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు.