ఘనంగా నందమూరి మోక్షజ్ఞ బర్త్ డే సెలబ్రేషన్స్..!

September 6, 2021 at 1:07 pm

నందమూరి బాలకృష్ణ తనయుడిగా, నందమూరి మోక్షజ్ఞ ఎప్పుడెప్పుడు సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇస్తాడు అని నందమూరి అభిమానులు గత కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. మోక్షజ్ఞ హీరోగా సినీ రంగంలోకి ప్రవేశపెట్టడం కోసం బాలకృష్ణ ఒక సరైన డైరెక్టర్ ను అలాగే కథ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. పలు సందర్భాలలో పలు రకాలుగా త్వరలోనే మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడు అని చెపుతూనే అభిమానుల్లో ఆశలు రేకెత్తిస్తున్నారు.. అయితే ఎప్పుడు ఏ డైరెక్టర్ తో ఏ సినిమా కథతో ప్రేక్షకుల ముందుకు మోక్షజ్ఞ వస్తాడో తెలియడం లేదు. 6 సెప్టెంబర్ 1994లో జన్మించిన నందమూరి మోక్షజ్ఞ (Instagram/Photo)

ఈరోజు నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ పుట్టినరోజు. నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడు హీరోగా వస్తాడు అంటూ.. ఈ రోజైనా ఏదైనా వార్త చెబుతారని వారు ఎదురు చూస్తున్నారు. మోక్షజ్ఞ బాలకృష్ణ దంపతులకు 1994 సెప్టెంబర్ 6వ తేదీన జన్మించాడు. ఆదిత్య తన తండ్రి నటించిన ఆదిత్య 369 సీక్వెల్ గా ఆదిత్య 999 మాక్స్ మూవీ తో హీరోగా ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. కళ్యాణ్ రామ్ తర్వాత ఎవరూ కూడా ఆ ఇంటి నుంచి కొత్త వాళ్ళు రాలేదు.. అందుకే మోక్షజ్ఞ కోసం అందరూ ఇంతగా ఎదురు చూస్తున్నారు. అయితే మోక్షజ్ఞ హీరోగా ఎప్పుడు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెడతాడో వేచి చూడాలి. గత రెండు మూడేళ్లుగా మోక్షజ్ఞ ఎంట్రీ గురించి టాలీవుడ్‌లో జోరుగా ఊహాగానాలు నడుస్తున్నాయి. ఈ రోజు నందమూరి బాలకృష్ణ ఏకైక పుత్ర రత్నం నందమూరి మోక్షజ్ఞ పుట్టినరోజు.(Twitter/Photo)

ఇకపోతే ఈ రోజు ఆయన పుట్టిన రోజు కాబట్టి వారి ఇంట్లో ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నట్లు సమాచారం.

ఘనంగా నందమూరి మోక్షజ్ఞ బర్త్ డే సెలబ్రేషన్స్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts