అఫీషియల్: వెంకీ, రానా వెబ్ సీరిస్.. టైటిల్ ఏంటంటే..!

బాబాయ్ వెంకటేశ్, అబ్బాయి రానా కలిసి ఓ వెబ్ సిరీస్ లో కలిసి నటిస్తున్నారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి చేస్తున్న వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ వారు నిర్మిస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలు నిజమయ్యాయి. వెంకటేష్, రానా కలిసి ఓ వెబ్ సిరీస్ కోసం నటిస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ కోసం ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నట్లు స్వయంగా వెంకటేష్ క్లారిటీ ఇచ్చాడు. అంతే కాదు అందులో రానా ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు వెల్లడించాడు. ఈ వెబ్ సిరీస్ కి రానా నాయుడు అని పేరు పెట్టినట్లు కూడా తెలిపాడు.

‘రానా పిల్లాడి నుంచి నటుడిగా ఎదగడం వరకు నా కళ్లలో చూశాను. కానీ రానా నాయుడు లో అతను మరింత బాగా కనిపించనున్నాడు. త్వరలో రానా నాయుడు నెట్ ఫ్లిక్స్ లో వస్తుంది.’ అని వెంకటేష్ తెలిపాడు.
అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య, అఖిల్ కలసి విక్రమ్ కుమార్ దర్శకత్వంలో మనం సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సంచలన విజయం సాధించింది. అప్పట్నుంచి దగ్గుబాటి ఫ్యామిలీ కూడా ఇలాంటి సినిమా చేయాలని అభిమానులు కోరుతూ వచ్చారు.

వెంకటేష్, రానా మంచి కథ కోసం ప్రయత్నించినప్పటికీ దొరక్క పోవడంతో ఈ కాంబినేషన్ లో ఇప్పటివరకు సినిమా సెట్ కాలేదు. అయితే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా సెట్ కాకున్నా కనీసం వెబ్ సిరీస్ వస్తుండడంతో దగ్గుబాటి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రానా నాయుడు వెబ్ సిరీస్ అతి త్వరలోనే నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది.