సంచలన నిర్ణయం తీసుకున్న ప్రభుదేవా.. కారణం..?

September 22, 2021 at 11:12 am

ప్రభుదేవా గురించి చిత్ర పరిశ్రమలో తెలియని వారంటూ ఎవరూ ఉండరు.. తెలుగు ,తమిళ్ , హిందీ లో కూడా పలు చిత్రాలలో పాటలకు కొరియోగ్రాఫర్ గా పనిచేసి మంచి గుర్తింపు పొందాడు. కొరియోగ్రాఫర్ మాత్రమే కాదు నిర్మాత, దర్శకుడు, నటుడు అలాగే డాన్స్ మాస్టర్ కూడా.. ఇక తన సరికొత్త డాన్స్ స్టెప్పులతో సినీ ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ ను కూడా క్రియేట్ చేసిన ఘనత ప్రభుదేవాకు మాత్రమే చెందుతుంది..

Prabhu Deva all set to marry for the second time: reports

కొరియోగ్రాఫర్ గా చేసిన ఎన్నో సినిమాలు పెద్ద హిట్ కావడంతో, టాప్ కొరియోగ్రాఫర్ గుర్తింపు పొందాడు.. ఇండియన్ మైకేల్ జాక్సన్ గా గుర్తింపు పొందిన ఈయన ఎమ్మెస్ రాజు బ్యానర్ లో వచ్చిన రెండు సినిమాలను చేసి, అలాగే హిందీలో కూడా రీమేక్ చేసి మంచి విజయం అందుకున్నాడు. ఇకపోతే సల్మాన్ ఖాన్ తో చివరిసారిగా డైరెక్ట్ చేసిన రాధే సినిమా అభిమానులను దారుణంగా నిరాశపరిచింది.. ఇక దానితో ఆయన తిరిగి చెన్నైకి చేరుకున్నాడు.. దర్శకుడిగా ఫెయిల్ అయ్యాను అన్న కారణంతోనే పూర్తిగా డైరెక్షన్ కి దూరంగా ఉండబోతున్నట్లు సంచలన నిర్ణయం తీసుకొని, ఆయన అభిమానులకు షాకింగ్ న్యూస్ తెలియజేశాడు.

Happy Birthday Prabhudeva: 'Metro Channel' to 'Chalmaar' - Five delightful dance performances of Prabhudeva | The Times of India

ఇక ప్రస్తుతం నటన వైపు పూర్తి దృష్టి పెడతానని చెబుతున్నారు. ఇక ప్రస్తుతం భగీర అనే సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా తెలుగు , తమిళ భాషల్లో కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.

సంచలన నిర్ణయం తీసుకున్న ప్రభుదేవా.. కారణం..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts