టాలీవుడ్ లో చిరంజీవి ఎవరి అభిమానో తెలుసా..?

టాలీవుడ్ లో మెగా స్టార్ చిరంజీవి అంటే ప్రతి ఒక్కరికి తెలుసు.ఆయన తన నటన తో, డాన్స్ తో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు.అయితే చిరంజీవి పలుసేవా కార్యక్రమాలను కూడా ప్రజలకు చేశారు.ఇక మెగాస్టార్ కి ఒక హీరో అంటే విపరీతమైన ఇష్టం ఉన్నదట. ఆ హీరో ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

టాలీవుడ్ లో అలనాటి హీరో సూపర్ స్టార్ కృష్ణ అప్పట్లోనే ఎంతో మంది అభిమానులను సంపాదించాడు.ఇక సినీ ఇండస్ట్రీలో సరి కొత్తగా ఏదైనా క్రియేట్ చేయాలి అంటే కేవలం అది కృష్ణ కే సాధ్యం అవుతుంది.సినీ ఇండస్ట్రీ కి కలర్ పిక్చర్స్ మొదట తీసుకొచ్చిన వ్యక్తి గా కృష్ణ కే సాధ్యమైంది. అంతేకాకుండా అప్పట్లో అత్యధిక భారీ బడ్జెట్ చిత్రాలలో నటించిన హీరోగా గుర్తింపు పొందాడు.

Image

ఇక సూపర్ స్టార్ కృష్ణ అంటే చిరంజీవికి తెగ ఇష్టమట. చిరంజీవి కృష్ణ కలసి నటించిన చిత్రం “తోడుదొంగలు”ఈ సినిమా ద్వారా వీరిద్దరూ బాగా పరిచయం అయ్యారు. అంతే కాకుండా సూపర్ స్టార్ కృష్ణ గురించి చిరంజీవి ఈ సినిమా షూటింగ్ సమయాలలో బాగా తెలుసుకున్నాడట.అందుచేతనే కృష్ణ అంటే తనకు చాలా ఇష్టమట. అంతేకాకుండా సూపర్ స్టార్ కృష్ణ అసోసియేషన్ లో మెంబర్గా కూడా చేరారు చిరంజీవి.

అలా ఆ ఫోటో కాస్త వైరల్గా మారుతోంది ఇప్పుడు. ప్రస్తుతం చిరంజీవి ఆచార్య సినిమా లో బిజీగా ఉన్నారు.https://twitter.com/MilagroMovies/status/1399359786328547329?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1399359786328547329%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftelugudesk.net%2Fmegastar-chiranjeevi-was-big-fan-of-super-star-krishna%2F