తన ఎంగేజ్మెంట్ గురించి చెప్తూ సిగ్గుపడ్డ నయనతార..!

August 11, 2021 at 7:14 am

సౌత్ ఇండియా లో ఇటీవల కాలంలో లేడీ సూపర్ స్టార్ అంటే నయనతారనే అందరికీ గుర్తుకు వస్తుంది. ఇక ఈ మధ్య కాలంలో ఆమె ఎన్నోసార్లు ఎందరితోనో బ్రేకప్ చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం దర్శకుడి విఘ్నేష్ తో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తున్నది. అంతేకాకుండా వీరిద్దరు సహజీవనం కూడా చేస్తున్నారు. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ఎక్కువ వార్తలు వినిపించాయి.

ఇక ఇదే విషయంపై విఘ్నేష్ శివన్ స్పందిస్తూ.. పెళ్లికి చాలా ఖర్చవుతుంది.దానికోసం డబ్బులు పోగు చేసుకుంటున్నాము అన్నట్లు నెటిజన్లకు చెప్పుకొచ్చారు. ఇక తొలిసారిగా విగ్నేష్ తో రిలేషన్ లో ఉన్నానని నయనతార పబ్లిక్ గా తన సమాధానం తెలిపినది. ప్రస్తుతం ఈమె నటిస్తున్న”నెట్రికన్”సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతుంది.

ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా నయనతార ఒక టీవీ చానల్ లో పాల్గొంది. అందులో యాంకర్ అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఎంగేజ్మెంట్ రింగ్ చూపిస్తూ సిగ్గుపడింది. ఇక లేటెస్ట్ గా ఇందుకు సంబంధించిన ఒక వీడియో కూడా ప్రస్తుతం వైరల్ గా మారింది. అంతేకాకుండా ఈమె తొలిసారిగా తన ప్రేమ వివాహం పై స్పందించడం ఫ్యాన్స్ కి తెగ ఆనందం వేస్తోంది.

నయనతార చివరిసారిగా సైరా నరసింహారెడ్డి సినిమాలో కనిపించింది. ఇక ఆ తరువాత మరి మెగాస్టార్ తోనే లూసిఫర్ సినిమాలో నటించబోతున్నట్లు సమాచారం. ఆ సినిమాలో ఈమె కీలకపాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఏదిఏమైనా ఈ ఏడాదైనా పెళ్లి చేసుకుంటారా..? లేదా..? అనే విషయం అది తొందర్లోనే మనకు తెలుస్తుంది.https://youtu.be/pbXGu4CvK9s

తన ఎంగేజ్మెంట్ గురించి చెప్తూ సిగ్గుపడ్డ నయనతార..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts