పుష్ప సినిమాలో ఇద్దరు స్టార్ హీరోయిన్లు..

August 11, 2021 at 7:34 am

ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా. మొదటిసారి అల్లుఅర్జున్ తో పాన్ ఇండియా మూవీ గా నిర్మిస్తున్న సినిమా ఇది. కానీ ఈ సినిమా కంటే ముందుగా అల్లు అర్జున్ ఐకాన్ అనే మూవీలో నటించాల్సి ఉండేది. వేణు శ్రీరామ్ ఈ ప్రాజెక్ట్ కు దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమాకి నిర్మాతగా దిల్ రాజు ఉండడం విశేషం. ఈ సినిమాపై నమ్మకం లేకపోవడంతో బన్నీ ముందుకు వెళ్ళలేక పోయాడు.

కానీ వకీల్ సాబ్ సినిమా హిట్ అవడం చేత మళ్ళీ ఐకాన్ సినిమాపై ఎక్కువగా వార్తలు వినిపించాయి. వకీల్ సాబ్ ప్రమోషన్ టైంలో దర్శకుడు వేణు శ్రీరామ్ అలాగే నిర్మాత దిల్ రాజు కూడా ఐకాన్ సినిమా గురించి ఎన్నో ప్రశ్నలు ఎదుర్కోవడంతో వాళ్ళు ఖచ్చితంగా ఈ సినిమా చేస్తున్నామని చెప్పడం తో మళ్ళీ ఐకాన్ మూవీ పై ఎక్కువగా వార్తలు వస్తున్నాయి.

పుష్ప సినిమా పార్ట్ వన్ అయిపోయిన వెంటనే ఈ సినిమా మొదలవుతుందని బన్నీ వాసు కూడా తెలియజేశారు. ఇదిలా ఉండగా పుష్ప సినిమాలో ఇద్దరు స్టార్ హీరోయిన్లు నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ బాలీవుడ్ భామలు వర్కౌట్ కాకపోతే ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లను రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం. వారెవరో కాదు పూజా హెగ్డే, సమంత వంటి స్టార్ హీరోయిన్ల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

అయితే ఇది ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీ కావున ఇందులో ఎక్కువ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి. అందుచేతనే హీరోయిన్లకు కూడా సమాన ప్రాధాన్యత కలిగినటువంటి ఉన్న పాత్రలు అయితేనే నటిస్తారు అన్నట్టుగా వినిపిస్తున్నది. ఇక సినిమా పార్ట్ 2 కూడా వుంటుంది.. కావున వీరు నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.

పుష్ప సినిమాలో ఇద్దరు స్టార్ హీరోయిన్లు..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts