చిరంజీవికి అదిరిపోయే సూపర్ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్న కూతురు..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కొణిదెల  గురించి మనందరికీ తెలిసిందే. ఈమె కాస్ట్యూమ్ డిజైనర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా ఈమె తన తండ్రి నటించిన సైరా నరసింహారెడ్డి మూవీ కూడా కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసింది. సుస్మిత ఈ మధ్య తన భర్త విష్ణు ప్రసాద్ తో కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ అనే ప్రొడక్షన్ హోజ్ ను కూడా లాంచ్ చేసింది. ఇది ఇలా ఉంటే ఆగస్టు 22న తన తండ్రి చిరంజీవి పుట్టినరోజు వేడుకకు ఆమె ఒక అదిరిపోయే సూపర్ ప్లాన్ చేస్తున్నట్టు తాను స్వయంగా వెల్లడించింది.

వెబ్ సిరీస్ తర్వాత రెండో ప్రాజెక్ట్ ను ప్రకటించబోతున్నాను అంటూ ట్విట్టర్లో ఓ టీజర్ విడుదల చేసింది.ఈ నేపథ్యంలోనే  సుస్మిత గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ నుంచి మీకు మరో ఫన్‌ను అందించబోతున్నామని తెలిపింది. అది ఏమిటనేది  నాన్న  బర్త్‌డే సందర్భంగా ఆగష్టు 22 తేదీన వెల్లడిస్తాను అంటూ ఆమె రాసుకొచ్చింది. ఈ సినిమాకు దిమ్మ‌లపాటి ప్ర‌శాంత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నట్లు తెలుస్తోంది.