శ్రియా సరన్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో ఎన్నో విజయవంతమైన చిత్రాలు చేసిన శ్రియా.. తనకంటూ స్పెసల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. టాలీవుడ్‌లో దాదాపు అగ్ర హీరోలందరి సరసన ఆడిపాడిన శ్రియా.. 2018లో ప్రియుడు, రష్యన్‌కు చెందిన క్రీడాకారుడు అండ్రీ కొచ్చీవ్‌ను వివాహం చేసుకుంది.
ఇక వివాహం తర్వాత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ అయిన శ్రియా.. ఎప్పటికప్పుడు భర్తతో ఏదో ఒక వీడియో చేస్తూ అభిమానులను అలరిస్తుంటుంది. ముఖ్యంగా ఈ ఇద్దరి సరసాలకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో తరచూ వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా కూడా శ్రియా ఓ వీడియో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేసింది.
ఈ వీడియోలో శ్రియ ఓ పాట పాడుతుండగా, దానికి ఆమె భర్త హుషారుగా స్టెప్పులు వేసాడు. అయితే చివర్లో ఒక్కసారిగా ఇద్దరు ముద్దులు పెట్టుకుని షాక్ ఇచ్చారు. ప్రస్తుతం వీరి రొమాంటిక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మొత్తానికి నాలుగు గోడల మధ్య చేయాల్సిన రొమాన్స్ కూడా పబ్లిక్ షో చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.
https://www.instagram.com/p/CScjsTFCq32/?utm_source=ig_web_copy_link