త‌గ్గేదే లే అంటున్న ర‌ష్మిక..ల‌క్కీ బ్యూటీ ఖాతాలో న్యూ రికార్డ్‌!

టాలీవుడ్ ల‌క్కీ బ్యూటీ, నేషనల్‌ క్రష్‌, మోస్ట్‌ డిజైరబుల్‌ ఉమెన్‌ రష్మిక మందన్నా గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఛ‌లో సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ర‌ష్మిక‌.. అతి త‌క్కువ స‌మ‌యంలో స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకుంది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ తెలుగులోనే కాకుండా.. హిందీ, త‌మిళ్ మ‌రియు క‌న్న‌డ భాష‌ల్లోనూ న‌టిస్తూ క్ష‌ణం తీరిక లేకుండా గ‌డిపేస్తుంది.

ఇక మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ త‌గ్గేదే లే అంటున్న వ్య‌వ‌హ‌రిస్తున్న ర‌ష్మిక‌.. ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్ల‌తో అల‌రించ‌డ‌మే కాకుండా అప్పుడ‌ప్పుడు అభిమానుల‌తో ముచ్చ‌ట్లు కూడా పెడుతుంటుంది. దాంతో ర‌ష్మిక ఫాలోవ‌ర్ల‌ సంఖ్య రోజు రోజుకు పెరిగి పోతోంది.

ఈ నేప‌థ్యంలోనే ర‌ష్మిక తాజాగా ఓ న్యూ రికార్డ్‌ను ఖాతాలో వేసుకుంది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే. ఈ ముద్దుగుమ్మ ఇన్‌‌‌‌స్టా‌‌‌గ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య ఏకంగా 20 మిలియన్లకు చేరింది. అన‌తి కాలంలోనే అత్య‌ధిక ఫాలోవ‌ర్స్‌ను సంపాదించుకున్న హీరోయిన్‌గా ర‌ష్మిక రికార్డు సృష్టించింది.