రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్న కార్తికేయ ..?

ఈ మధ్య అర్జున్ రెడ్డి సినిమా తర్వాత ఆర్ ఎక్స్ 100 సినిమా మనకు బాగా గుర్తుండిపోయింది. ఈ సినిమాలో నటించిన హీరో గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. ఈయన ఆర్ ఎక్స్ 100 సినిమాలో మంచి క్యారెక్టర్ ను ఎంచుకున్నాడు. ఆ సినిమా తరువాత వరుస సినిమాల్లో హీరోగా నటిస్తూ రాణిస్తున్నాడు. కార్తికేయ గుమ్మకొండ గురించి ఒక శుభవార్త తెలిసింది. త్వరలోనే కార్తికేయ ఒక ఇంటివాడు అవుతున్నాడు. ఈ మధ్యకాలంలో బంధువుల సమావేశంలో ఈ నిర్ణయాలను తీసుకున్నారట. అంతేకాకుండా ఆయన నిశ్చితార్థం కూడా అయినట్లు చెప్తున్నారు.

నిశ్చితార్థానికి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటో వాట్స్అప్ స్టేటస్ లో పిక్ ఫోటోలో కార్తికేయ ,తనకు కాబోయే భార్య ఉన్నారు. ఈ ఫోటో కింద ఎంగేజ్ అని మాత్రమే ఉంది. కానీ ఈ కార్యక్రమం ఈనెల 22 న రాత్రి ఒక ఫంక్షన్ హాల్ లో జరిగిందని తెలుస్తోంది.

కరోనా టైంలో అందరూ ఫంక్షన్ లను సింపుల్ గా జరుపుకుంటున్నారు. ఈ హీరో ఫంక్షన్ కి కూడా తక్కువ జనసముదాయం వచ్చారు. అయితే వేడుకకు సంబంధించి కార్తికేయ సోషల్ మీడియాలో ఎటువంటి పోస్ట్లు ఇప్పటివరకు పెట్టలేదు.

ఈయన ఇటీవల చావు కబురు చల్లగా సినిమాలో గొప్ప నటనను ప్రదర్శించాడు. ప్రస్తుతం అజిత్ వాలిమై సినిమాలో కీలకపాత్రను పోషిస్తున్నాడు. అంతేకాకుండా రాజ రాజ విక్రమార్క సినిమాలో కూడా నటించబోతున్నాడు. ఈయనకు మంచి విజయాలను సమకూర్చాలని కొందరు ప్రేక్షక అభిమానులు కోరుకుంటున్నారు.