భర్త నిక్‌కు ప్రియాంక చోప్రా స్వీట్ సర్ప్రైజ్.. ఏమిటంటే?

ప్రియాంక చోప్రా ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లోనూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది. ఈమె హాలీవుడ్ పాప్ సింగర్ అయిన నిక్ జోనస్ ను పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. వీరి అన్యోన్య దాంపత్యం గురించి తెలియాలంటే వీరి సోషల్ మీడియా అకౌంట్ లో చూస్తే చాలు. ప్రియాంక చోప్రా తన కంటే వయసులో పదేళ్లు చిన్నవాడైనా నిక్ జోనస్ తో కలిసి డేటింగ్ చేసి ఆపై పెళ్లి చేసుకుని ఒకటే అయింది. అయితే ప్రస్తుతం ప్రియాంక చోప్రా సిటాడెల్ షూటింగ్ లో బిజీగా ఉంది. అక్కడ నిక్ జోనస్ తన సోదరులు జో జోనస్ లతో కలిసి ఆసక్తిగల పర్యటనను ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది.

ప్రియాంక చోప్రా తన ప్రియుడు నిక్ జోనస్ కు తన కాన్సర్ట్ కు ముందు స్వీట్ సర్ ప్రైజ్ వచ్చింది. నిక్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో రుచికరమైన కేక్ ఫోటో ని పంచుకున్నాడు. తన భార్యను ఎంతో మిస్ అవుతున్నట్లు తెలిపాడు. ఈ ఫోటోని షేర్ చేస్తూ థాంక్స్ ప్రియాంక చోప్రా యూ ఆర్ ది బెస్ట్ అంటూ కాప్షన్ ఇచ్చారు. ఇటీవల ఈ దంపతులు కొన్ని పేజీలను ఇంస్టాగ్రామ్ ద్వారా పంచుకోగా ప్రియాంక తన భర్త నిక్ జోనస్ చెంపపై ముద్దు పెట్టుకుంది. ఈ వీడియో నిమిషాల్లోనే వైరల్ అయిపోయింది.