చంద్రబోస్, సుచిత్ర పెళ్లి వెనుక అసలు కథ ఇదేనా?

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా ప్రేమ, పెళ్లి, విడాకులు లాంటి పదాలు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. ఇండస్ట్రీలో చాలామంది ప్రేమించి పెళ్లి చేసుకొని ఆ తరువాత విడిపోయారు. కానీ ఇండస్ట్రీలో కొందరి ప్రేమకథల విషయానికి వస్తే ఒక్కొక్కరి ప్రేమకథ ఒక్కోలా ఉంటుంది. అలాంటి వారిలో పాటల రచయిత చంద్రబోస్, డాన్స్ కొరియోగ్రాఫర్ సుచిత్ర కూడా ఒకరు. వీరిద్దరూ కొన్ని సినిమాల్లో కలిసి పని చేయడం వల్ల ఒక్కటయ్యారు. అయితే చంద్రబోస్ కంటే సుచిత్ర సినీ ఇండస్ట్రీలోకి ఆరు సంవత్సరాల ముందే అడుగుపెట్టింది.

కానీ వీరిద్దరూ అలాంటి పట్టింపులేని లేకుండా ఏడు అడుగులు వేసి ఒకటయ్యారు. వీరి పెళ్లికి ఇండస్ట్రీలో కొందరు ప్రముఖుల సహాయం కూడా చేశారని సమాచారం. ఎస్ వి కృష్ణారెడ్డి పెళ్లి పీటలు సినిమాకు చంద్రబోస్ పాటలు రాయగా, అదే సినిమాలో పాటలకు సుచిత్ర కొరియోగ్రాఫర్ గా చేసింది. అలా ఆ సినిమాకు సంబంధించి హైదరాబాద్ నుంచి చెన్నై ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఈ ప్రయాణంలో వారిద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. మొదట చంద్రబోస్ ప్రపోస్ చేసినప్పటికీ అందుకు సుచిత్ర ఒప్పుకోలేదట. ఆ తర్వాత ఆ చంద్రబోస్ ఆమెకు అర్థమయ్యేలా వివరించి ఆమె కుటుంబ సభ్యులను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారట.