అఖిల్ బాటలో నిఖిల్.. ఏమౌతుందో?

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తొలినాళ్లలో రొటీన్ లవ్‌స్టోరీ చిత్రాలను తీస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశాడు. కానీ అతడికి పెద్దగా గుర్తింపు మాత్రం రాలేకపోయింది. ఇక ‘స్వామి రారా’ చిత్రం నుండి మనోడు కథలను ఎంచుకోవడంలో ఆరితేరిపోయాడు. నిఖిల్ చేసే ప్రతి సినిమా కంటెంట్ పరంగా సరికొత్తగా ఉంటుందనే ఫీలింగ్ ఆడియెన్స్‌లో కలిగించాడు ఈ హీరో. దీంతో నిఖిల్ చేసే సినిమాలు ఎలా ఉన్నా, వాటిని చూసేందుకు జనం థియేటర్లకు క్యూ కడుతుంటారు.

కాగా నిఖిల్ ప్రస్తుతం కార్తీకేయ-2, 18 పేజీస్ అనే రెండు చిత్రాల్లో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా రెండు విభిన్న జోనర్‌లకు చెందడంతో ఈ సినిమాలు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ హీరో ప్రస్తుతం అక్కినేని యంగ్ హీరో అఖిల్‌ను ఫాలో అవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అఖిల్ ప్రస్తుతం స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ అనే స్పై థ్రిల్లర్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి కథనే నిఖిల్ కూడా ఓకే చేశాడు. తాజాగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన ఆయన చేశాడు. ఈ సినిమా హిట్, ఎవరు వంటి సినిమాలకు ఎడిటర్‌గా పని చేసిన గ్యారీ బిహెచ్ డైరెక్ట్ చేయనుండటంతో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది.

ఇక ఈ సినిమాలో నిఖిల్ ఎలాంటి లుక్‌తో కనిపిస్తాడా, అసలు ఈ సినిమా కథ ఎలాంటి కొత్తదనంతో వస్తుందా అనే ఆసక్తి అప్పుడే ఆడియెన్స్‌లో క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాను రెడ్ సినిమాస్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తుండగా, ఇందులో హీరోయిన్‌తో పాటు మిగతా నటీనటులు, టెక్నీషియన్ల గురించిన వివరాలు తెలియాల్సి ఉంది. మరి అఖిల్‌ను ఫాలో అవుతున్న నిఖిల్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో ఈ సినిమా రిలీజ్ అయితేనే చెప్పగలం.