గ్రౌండ్‌లో నగ్నంగా పరుగులు పెట్టిన వ్యక్తి..ఎందుకో తెలిస్తే షాకే!

August 17, 2021 at 8:09 am

బెట్టింగ్స్‌.. ఎంత ప్ర‌మాద‌క‌ర‌మైన‌వో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ బెట్టింగ్స్ కార‌ణంగా ఎంద‌రో రోడ్డున ప‌డ్డారు. మ‌రెంద‌రో ప్రాణాలూ కోల్పోయారు. ఈ బెట్టింగ్ కార‌ణంగానే తాజాగా ఓ వ్య‌క్తి నెట్టింట హాట్ టాపిక్‌గా మారాడు. ఆ వ్య‌క్తి ఏం చేశాడో తెలుసా ఒంటిపై నోలి పోగు లేకుండా బ‌ట్ట‌లు మొత్తం విప్పేశాడు. అక్క‌డితో ఆగ‌లేదు.. అంద‌రూ చూస్తుండ‌గా గ్రౌండ్‌లో ప‌రుగులు పెట్టాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..

ఓ యువకుడు తన ఫ్రెండ్స్‌తో బెట్ కట్టాడు. బెట్ ఏంటంటే.. బట్టలు లేకుండా గ్రౌండ్ అటువైపుకి నగ్నంగా పరుగెత్తి… మళ్లీ వెనక్కి రావాలి. స‌ద‌రు యువ‌కుడు డ‌బ్బు కోసం ఏ మాత్రం వెనకాడలేదు. వెంట‌నే తాను ధ‌రించిన దుస్తుల‌ను తీసేసి.. గ్రౌండ్‌లో ప‌రుగు పెట్ట‌డం స్టార్ట్ చేశారు. అయితే స‌ద‌రు యువ‌కుడిని గ‌మ‌నించిన సెక్యూరిటీ గార్డులు..వీడెవడ్రా ఇలా పరుగెడుతున్నాడు అని ఆశ్చర్యపోయారు. ఈ క్ర‌మంలోనే అత‌డిని ప‌ట్టుకునేందుకు వాళ్లూ ప‌రుగులు తీశారు. కానీ, సెక్యూరిటీకి దొర‌క్కుండా.. అటూ, ఇటూ ప‌రిగెట్టి ఎలాగోలా త‌న టార్గెట్‌ను ఫినిష్ చేశాడు.

ఇక చివ‌ర్లో స‌ద‌రు యువ‌కుడిని సెక్యూరిటీ అదుపులోకి తీసుకుంది. ఇక ఇందుకు సంబంధించిన వీడియోను ఐపీఎస్ ఆఫీసర్ రుపిన్ శర్మ ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. అయితే ఈ వీడియోలో కంటెంట్ నేరపూరితమైనది. దాన్ని మీడియాలో అలాగే ఉన్నది ఉన్నట్లు చూపించకూడదు.

గ్రౌండ్‌లో నగ్నంగా పరుగులు పెట్టిన వ్యక్తి..ఎందుకో తెలిస్తే షాకే!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts