“మా” ఎన్నికలపై మోహన్‌ బాబు సంచలన వ్యాఖ్యలు..?

“మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా)” అధ్యక్ష ఎన్నికలపై కలెక్షన్ కింగ్ మోహన్‌ బాబు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఈరోజు జరిగిన “మా” కార్యవర్గ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సమావేశంలో మాట్లాడిన ఆయన ఏం మాట్లాడాలో.. ఎలా మాట్లాడాలో అర్థంకాని పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయని అన్నారు. ఎవరికి వారే యమునా తీరే అన్న చందాన ప్రతి ఒక్కరూ వ్యవహరిస్తున్నారని ఆయన ఆగ్రహం వెళ్లగక్కారు.

జీవిత.. “మా”లోకి.. రాజశేఖర్‌కు వెలకం అని చెప్పండంటూ ఆయన విచిత్రంగా వ్యాఖ్యానించారు. కూడబెట్టిన సొమ్ముతో బిల్డింగ్‌ కొని.. మళ్లీ దానిని సగం ధరకు అమ్మేయడం ఎంత వరకు కరెక్ట్? అని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంపై పెద్దలు ఆలోచించాలని కోరారు. త్వరలోనే ఎన్నికలు పెడతారని భావిస్తున్నట్టు చెప్పుకొచ్చిన మోహన్‌ బాబు.. ఈ మేరకు అభిప్రాయాలు సేకరించి కృష్ణం రాజు నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. అయితే ప్రస్తుతం మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.