క్యూబ్స్ తో 6.5 అడుగుల ఫోటోను తయారు చేసిన చిరు అభిమాని?

మెగాస్టార్ చిరంజీవి ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు సినీ ఇండస్ట్రీలో కోట్లాది మంది ప్రేక్షకుల మనసులలో స్థానం సంపాదించుకున్న వ్యక్తి హీరో చిరంజీవి. ఈయనకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అంతే కాకుండా సినీ ఇండస్ట్రీలో కూడా ఈయనకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే ఈయన తర్వాత వచ్చిన ఎంతో మంది హీరోలు చిరంజీవి ని ఆదర్శంగా తీసుకుని మరి ఇండస్ట్రీలో హీరోలుగా ఎదిగారు. అయితే చాలా మంది అభిమానులు తమ హీరోలపై ఉన్న అభిమానాన్ని అనేకవిధాలుగా వ్యక్తం చేస్తుంటారు.

ఇక చిరు అభిమానులు కూడా ఆ చిరు బర్త్ డే సందర్భంగా ఏకంగా 6.5 అడుగుల ఎత్తైన అరుదైన ఫోటో ను చిత్రీకరించారు.మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా తమిళనాడు రూబిక్ క్యూబ్ అసోసియేషన్‌కు చెందిన బిందు, ఆనంద్‌ కలిసి 955 రూబిక్ క్యూబ్స్ తో 6.5 అడుగుల ఎత్తయిన అరుదైన ఫోటోను దృశ్యంతో తమ అభిమానాన్ని చాటుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. మరోవైపు ఆయన నటిస్తున్న సినిమాలకు సంబంధించి వరుస అప్‌డేట్‌లతో సినీ అభిమానులను ఆశ్చర్యపరిచారు.