మంచు విష్ణు ప్రేమ కథ లో ఎన్ని ట్విస్టులో..?

“నా రూటే సపరేటు” అంటున్న సీనియర్ హీరో గుర్తు ఉండే ఉంటుంది. ఆ హీరో ఎవరో కాదు మంచు మోహన్ బాబు.. వారికి ఇద్దరు కొడుకులు , ఒక కుమార్తె పెద్ద కొడుకు మంచు విష్ణు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కానీ విష్ణు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. మంచు విష్ణు ప్రేమ కథలో కొన్ని ట్విస్టులు ఉన్నాయి. మంచు ఫ్యామిలీ అభిమానులకు ఈ విషయం తెలియదు..అయితే తాజాగా ఆలీతో సరదాగా షో కి విష్ణు వచ్చి కొన్ని నిజాలను బయటపెట్టాడు.

మంచు విష్ణు భార్య పేరు వెరోనికా అలియాస్ విన్నీ
సంవత్సరం పాటు వీరిద్దరూ ప్రేమించుకున్నామని చెప్పారు. మంచు విష్ణుకు తన తండ్రి అంటే చాలా భయం.. అందుకని తండ్రికి తెలియకుండా మేనేజ్ చేశాడట.

తాజ్ కృష్ణ హోటల్ లో షూటింగ్ బ్రేక్ టైం లో తాను, వెరోనికా కలుసుకునేవాళ్ళమని చెప్పుకొచ్చారు. ఒకరోజు తాను వెరోనిక కలిసి లంచ్ చేస్తున్నప్పుడు , సర్వర్ వచ్చి సార్ పెద్ద సార్ వస్తున్నాడు అన్నాడట. అంటే నాన్న వస్తున్నాడని తెలియగానే విష్ణుకి చెమటలు పట్టాయట మేనేజర్ సహాయంతో వీరిద్దరూ కలిసి సర్వింగ్ రూం నుంచి బయటకు వెళ్ళామని చెప్పారు.

ఆ తర్వాత మీడియాలో కొన్ని వార్తలు వినిపించాయి. వెరోనికా తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. వీళ్ళ ప్రేమ కు అండగా నిలబడిన వారిలో మన కమెడియన్ బ్రహ్మానందం, అలాగే దాసరి నారాయణ వైఫ్ పద్మ వీరిద్దరూ కలిసి మోహన్ బాబు ని పెళ్లికి ఒప్పించడానికి ప్రయత్నం చేశారు..ఇక ఎట్టకేలకు మోహన్ బాబు కూడా వీరి పెళ్లికి ఒప్పుకున్నారట.

కొద్దిరోజుల తర్వాత ఇరు కుటుంబాలు మాట్లాడుకొని నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టుకున్నారు అని మంచు విష్ణు చెప్పారు. మంచు విష్ణు ప్రేమ కథలు ఇన్ని కొత్త ట్విస్ట్ లు ఉన్నాయని ప్రేక్షకులకు కు ఇప్పుడే అర్థమయింది. తరువాత ఎంతో ప్రేమించి , కష్టపడి పెద్దలను ఒప్పించి వెరోనికా నీ పెళ్లి చేసుకున్నాడు విష్ణు